Sarath Kumar: వరలక్ష్మీ పెళ్లి.. జోరుగా తండ్రి సందడి!

ABN, Publish Date - Jul 01 , 2024 | 05:29 PM

'క్రాక్‌' సినిమాలో జయమ్మ పాత్రతో తెలుగు స్క్రీన్ పై తనదైన మార్క్‌ వేసింది వరలక్ష్మీ శరతకుమార్‌. ఆ చిత్రం తర్వాత తెలుగులో అవకాశాలు వరుస కట్టాయి. ప్రస్తుతం ఆమె పెళ్లి పీటలెక్కనుంది.

'క్రాక్‌' (Krack)సినిమాలో జయమ్మ (Jayamma) పాత్రతో తెలుగు స్క్రీన్ పై తనదైన మార్క్‌ వేసింది వరలక్ష్మీ శరతకుమార్‌ (varalakshmi Sarathkumar). ఆ చిత్రం తర్వాత తెలుగులో అవకాశాలు వరుస కట్టాయి. ప్రస్తుతం ఆమె పెళ్లి పీటలెక్కనుంది. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానం అందించింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త నికోలాయ్‌ సచ్‌దేవ్‌ను ఏడడుగులు వేయనుంది. థాయ్‌లాండ్‌ వీరిద్దరి పెళ్లికి వేదిక కానుంది. జూలై 2న వీరిద్దరు మూడుముళ్ల బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు.

తాజాగా మెహందీ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆమె తండ్రి శరత్‌కుమార్‌ డ్యాన్సు వేస్తూ సందడి చేశారు. మెహందీ వేదిక వద్దే అతిథులతో కలిసి శరత్‌కుమార్‌ డ్యాన్సుతో అలరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. 

Updated Date - Jul 01 , 2024 | 05:29 PM