Sanjjanaa Galrani: దర్శన్  త్వరగా బయటకు రావాలి!

ABN, Publish Date - Jul 09 , 2024 | 07:53 PM

రేణుకాస్వామి (Renuka Swami) హత్య కేసులో కన్నడ హీరో దర్శన్‌ (Darshan) సహా మొత్తం 17 మంది నిందితులను అరెస్ట్‌ చేసి పరప్పన అగ్రహార జైలుకు తరలించారు.

రేణుకాస్వామి (Renuka Swami) హత్య కేసులో కన్నడ హీరో దర్శన్‌ (Darshan) సహా మొత్తం 17 మంది నిందితులను అరెస్ట్‌ చేసి పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. అయితే దర్శన్  విషయంలో కన్నడ చిత్ర పరిశ్రమలో పలువురు తారలు దర్శనకు మద్దతుగా నిలవగా, కొందరు మాత్రం అతనికి శిక్షణ పడాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో సంజనా గల్రానీ (Sanjjanaa Galrani) హీరో దర్శన్ కు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆమె స్పందించింది. ‘‘నటుడు దర్శన్‌ ఇలాంటి పని చేయలేడు. ఇలాంటి సంఘటనలు జరగకూడదు. చట్ట ప్రకారం తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది. దర్శన్‌ త్వరగా బయటకు వచ్చి కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని కన్నడ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి సంజనా గల్రానీ అన్నారు. 

రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్‌ అరెస్ట్‌పై ఆమె మాట్లాడుతూ "ఈ సంఘటన గురించి నేను నిజంగా షాక్‌ అయ్యాను. ఈ ఘటనలో దర్శన్‌ ప్రమేయం ఉండకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈ ఘటన దర్శన్‌ ప్రమేయం ఉందేమో కానీ దర్శన్‌ వల్ల కాదన్నది నిజం. నిరుపేద కుటుంబానికి చెందిన ఓ యువకుడిపై దాడి జరిగిందంటే నమ్మలేకపోతున్నాను. నాకు వ్యక్తిగతంగా దర్శన్‌ తెలుసు, దర్శన్‌ ఇలాంటి పని చేసే అవకాశం లేదు. దర్శన్‌తో ‘అర్జున్‌’ సినిమాలో నటించాను. ఆయన నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. స్త్రీలతో గౌరవంగా ఉంటాడు. షూటింగ్‌ సమయంలో ధైర్యం చెప్పేవాడు. శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసు సందర్భంగా ‘అంతా బాగుంటుంది’ అని హామీ ఇచ్చారు. ఈ సంఘటన జరగకూడదు. ముఖ్యంగా హత్య చాలా క్రూరంగా జరిగింది. నా పగవాళ్లకు కూడా ఇలా జరగకూడదు. సోషల్‌ మీడియాలో ఇతరులను కించపరిచే వ్యాఖ్యలను ఖండించాలి. రేణుకాస్వామి కుటుంబానికి న్యాయం చేయాలి. రేణుకాస్వామి భార్యకు ప్రభుత్వం ఉద్యోగం ఇప్పించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. రేణుకా స్వామి పంపిన అసభ్యకరమైన సందేశాలు వల్లే ఈ తరహా ఘటన జరిగింది. అలాంటి సంఘటనలు నా జీవితంలో కూడా జరిగాయి. ఓ వీఐపీ కొడుకు నాకు అర్థరాత్రి అసభ్యకరమైన సందేశాలు పంపాడు. నా భర్తతో చర్చించి పోలీసులకు ఫిర్యాదు చేశాను. పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నేను జైలుకు వెళ్లిన కేసులో జైలు శిక్ష అనుభవించాక తప్పుడు కేసు అని చెప్పి క్లోజ్‌ చేశారు. జైలులో అందరూ ఒకటే. ఎవరికీ ఎక్కువ కాదు, తక్కువ కాదు. నరకం కావాలంటే చావొద్దు, ఒకసారి జైలుకి వెళ్తే సరిపోతుంది. కుటుంబంలో ఎవరైనా జైలుకి వెళితే వాళ్ళు జైలుకు వెళ్లడమే కాదు, కుటుంబం మొత్తం జైలుకు వెళుతుంది’’ అని సంజనా అన్నారు.

Updated Date - Jul 09 , 2024 | 07:54 PM