Saira Banu : ప్లీజ్‌.. ఆయనపై విమర్శలు ఆపండి..

ABN, Publish Date - Nov 24 , 2024 | 05:48 PM

రెహమాన్‌ను తప్పుబడుతూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సైరా బాను స్పందించారు. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అని ఆమె కొనియాడారు


సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌(AR Rahman) ఆయన సతీమణి సైరా బాను (Saira banu)మూడు దశాబ్దాల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రెహమాన్‌ను తప్పుబడుతూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సైరా బాను స్పందించారు. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అని ఆమె కొనియాడారు. ‘‘ప్రస్తుతం నేను ముంబయిలో ఉన్నా. గత కొన్ని నెలలుగా నా ఆరోగ్యం బాలేదు. ఆ కారణంతోనే ఆయనకు దూరంగా ఉండాలనుకున్నా. యూట్యూబ్‌, తమిళ మీడియాను ఒక్కటే కోరుకుంటున్నా. దయచేసి ఆయన గురించి ఎలాంటి చెడు ప్రచారం చేయవద్దు. ఆయన చాలా మంచి మనసు ఉన్న వ్యక్తి. ప్రపంచంలో ఉన్న గొప్ప వ్యక్తుల్లో రెహమాన్‌ ఒకరు. సైరా ఎక్కడికి వెళ్లిందని అందరూ మాట్లాడుకుంటున్నారు. ట్రీట్‌మెంట్‌ కోసం ముంబయి వచ్చా. ఆయన అంటే నాకెంతో ఇష్టం. ఆయనకు కూడా నేనంటే ఇష్టం. ఆయనపై విమర్శలు చేయడం ఇకనైనా ఆపండి. మేము ఇంకా అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. కాబట్టి ఈ క్లిష్ట సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించవద్దు. త్వరలోనే నేను చెన్నై వస్తా.ఆయన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించవద్దు’’ అని ఆమె కోరారు. \

29 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ ఈ నెల 19న రెహమాన్‌ ఒక పోస్ట్‌ పెట్టారు. పరస్పర అంగీకారంతో తాము విడిపోతున్నామని చెప్పారు. అదే రోజున ఆయన బృందంలోని బేస్‌ గిటారిస్ట్‌ మోహినిదే కూడా తన భర్త నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో ఎన్నో ప్రచారాల తెరపైకి వచ్చాయి. ఈ రెండు జంటల విడాకులకు ఎలాంటి సంబంధం లేదని సైరా తరఫు న్యాయవాది ఇటీవల తెలిపారు. తన తండ్రి గురించి తప్పుడు కథనాలు చూస్తుంటే ఎంతో బాధగా ఉందని రెహమాన్‌ తనయుడు అమీన్‌ పోస్ట్‌ పెట్టాడు. మోహినిదే కూడా ఈ వార్తలపై స్పందించింది. తన విడాకులు వ్యక్తిగతమని తెలిపింది.

Ali: అక్రమా నిర్మాణాలు.. అలీకి నోటీసులు


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 24 , 2024 | 05:49 PM