Ruhani Sharma: వెట్రిమారన్ నిర్మాణంలో.. బోల్డ్ భామ

ABN, Publish Date - Jul 03 , 2024 | 02:43 PM

తమిళ స్టార్ కెవిన్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘మాస్క్’. దిగ్గజ దర్శకుడు వెట్రిమారన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆండ్రియా నెగెటివ్‌ రోల్‌ పోషిస్తుండగా హీరోయిన్‌గా రుహానీ శర్మను ఎంపిక చేశారు.

Ruhani Sharma

రీసెంట్ గా స్టార్ అనే తమిళ సినిమాతో హిట్ కొట్టిన కెవిన్ (Kavin) తాజాగా నటిస్తున్న చిత్రం ‘మాస్క్’ (Mask). దిగ్గజ దర్శకుడు వెట్రిమారన్ (Vetri Maran) నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో ఆండ్రియా (Andrea Jeremiah) నెగెటివ్‌ రోల్‌లో కీలక పాత్ర పోషిస్తుండగా. హీరోయిన్‌గా రుహానీ శర్మ (Ruhani Sharma)ను ఎంపిక చేశారు. ఈ చిత్రం ద్వారా విక్రమన్‌ అశోక్ (Vikarnan Ashok) దర్శకుడిగా పరిచయమవుతున్నారు.


ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాల్లో బిజీగా ఉన్న రుహానీ శర్మ (Ruhani Sharma) ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేసింది.

నేను తమిళ పరిశ్రమలో అడుగు పెట్టడానికి ఇలాంటి మంచి చిత్రంలో అవకాశం లభించడం అద గా భావిస్తున్నానని పేర్కొంది. తొలి చిత్రమే వెట్రీమారన్ వంటి దర్శకుడి చిత్రంలో చేయడం కలలా ఉందని తెలిపింది. ఈ సందర్భంగా షూటింగ్ ష్పాట్ ఫొటోలను షేర్ చేసింది.

Updated Date - Jul 03 , 2024 | 09:01 PM