Sweet Heart: యువన్‌ శంకర్‌ రాజా.. ‘స్వీట్‌ హార్ట్‌’ డబ్బింగ్‌ షురూ

ABN, Publish Date - Aug 09 , 2024 | 01:00 PM

నటుడు రియోరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘స్వీట్‌ హార్ట్‌’ సినిమా డబ్బింగ్‌ తాజాగా ప్రారంభించారు. త‌మిళ అగ్ర సంగీత ద‌ర్శ‌కుడు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించ‌డంతో పాటు నిర్మించ‌డం విశేషం.

rio

నటుడు రియోరాజ్(Rio raj) ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘స్వీట్‌ హార్ట్‌’ (Sweet Heart) సినిమా డబ్బింగ్‌ తాజాగా ప్రారంభించారు. డెబ్యూ డైరెక్టర్‌ స్వినీత్‌ ఎస్‌.సుకుమార్ (Swineeth Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ‘నెంజముండు నేర్మైయుండు’, ‘జో’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆలరించిన రియో రాజ్ (Rio raj), గోపికా రమేష్ (Gopika Ramesh), రంజీ పణికర్‌, రెడిన్‌ కింగ్‌స్లీ, అరుణాచలం, సురేష్‌ చక్రవర్తి, తులసి తదితరులు నటిస్తున్నారు.


లవ్‌ ఎంటర్‌టైన్మెంట్‌గా తెరకెక్కిన‌ ఈ చిత్రానికి త‌మిళ అగ్ర సంగీత ద‌ర్శ‌కుడు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించ‌డంతో పాటు, వైఎస్‌ఆర్‌ (యువన్‌ శంకర్‌ రాజా) ఫిలిమ్స్‌ బ్యానరుపై నిర్మించ‌డం విశేషం. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తాజాగా డబ్బింగ్‌తో పాటు పోస్ట్‌ప్రొడక్షన్‌ నిర్మాణ పనులను జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను నిర్మాణ సంస్థ రిలీజ్‌ చేయనుంది.

Updated Date - Aug 09 , 2024 | 01:00 PM