Kanguva: కంగువా సౌండింగ్‌పై కామెంట్స్.. స్పందించిన ఆస్కార్ విన్నర్
ABN, Publish Date - Nov 15 , 2024 | 05:18 PM
సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కంగువా’ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో సౌండింగ్ భరించలేనంతగా ఉందని పలువురు ఆడియన్స్ విమర్శస్తున్నారు. దీనిపై ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజినీర్ రసూల్ పోకూట్ (Resul Pookutty) స్పందించారు.
సూర్య (Suriya) హీరోగా శివ (Shiva) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కంగువా’ (Kanguva) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎపిక్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. కొన్ని సన్నివేశాల్లో సౌండింగ్ భరించలేనంతగా ఉందని పలువురు ఆడియన్స్ విమర్శస్తున్నారు. దీనిపై ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజినీర్ రసూల్ పోకూట్ (Resul Pookutty) స్పందించారు.
‘‘కంగువా’లో సౌండ్ బాలేదంటూ వస్తోన్న రివ్యూలు నన్ను ఎంతో నిరుత్సాహపరుస్తున్నాయి. కొన్ని సన్నివేశాల్లో సంగీతం బాలేదని అంటున్నారు. ఇలాంటి చిత్రాలకు మ్యూజిక్ అందించడం యుద్థంతో సమానం. ఈ విషయంలో ఎవరినీ నిందించలేం. ఇలాంటి సమస్యలు చివరి క్షణాల్లో ఎదురవుతాయి. సినిమా రూపొందించే క్రమంలో జరిగే చిన్న తప్పుల వల్ల దాని మొత్తం విలువ కోల్పోతుంది. సినిమా పూర్తయ్యాక ప్రేక్షకులు తలనొప్పితో బయటకు వెళ్తే.. రిపీటెడ్ ఆడియన్స్ ఉండరు. కానీ ఈ సినిమాకు రిపీట్ ఆడియన్స్ ఉన్నారు’’ అని అన్నారు. అయితే ఈ చిత్రంలో సూర్య నటనను అందరూ ప్రశంసిస్తున్నారు. సూర్య వన్ మ్యాన్ షో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. వెయ్యేళ్ల కిందటి జానపద కథను ప్రస్తుత కాలానికి పెడుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శివ దర్శకుడు. స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.