Raveena Ravi: డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ ప్రేమ.. ప్రియుడు ఎవరంటే..

ABN, Publish Date - Nov 02 , 2024 | 07:42 AM

దక్షిణాది నటి, ప్రముముఖ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ రవీనా రవి (Raveena ravi) ప్రేమ పెళ్లికి సిద్థమైంది. ఈ విషయాన్ని ఆమె  సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం సినిమాలకు ఆమె వాయిస్‌ ఇచ్చింది.

దక్షిణాది నటి, ప్రముముఖ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ రవీనా రవి (Raveena ravi) ప్రేమ పెళ్లికి సిద్థమైంది. ఈ విషయాన్ని ఆమె  సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం సినిమాలకు ఆమె వాయిస్‌ ఇచ్చింది. అయితే ఇప్పుడు మలయాళ దర్శకుడితో ప్రేమలో ఉన్నట్టు, త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు పేర్కొంది. ‘వాలట్టి’ అనే మలయాళ సినిమాతో పాపులర్‌ అయిన దర్శకుడు  దేవన్‌ జయకుమార్‌తో (Devan jayakumar) ఆమె ప్రేమలో ఉంది. త్వరలో పెళ్లి చేసుకున్నట్లు ఒక ఫోటోను కూడా పంచుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్‌ ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. త్వరలో పెళ్లి తేదీని కూడా ఈ జోడీ ప్రకటించనుంది. (Dubbing Artist Raveena Ravi)

తెలుగులో  'ఓకే బంగారం(Ok bangaram)’, 'ప్రేమమ్‌’, '2.0’, 'నవాబ్‌’ వంటి సినిమాల్లో హీరోయిన్లకు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా పనిచేసింది. చెన్నైకి చెందిన రవీనా రవి మొదట డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ పలు సినిమాల్లో కూడా నటించింది. జవాన్‌ సినిమాలో దీపికా పదుకోన్‌కు తెలుగు వాయిస్‌ ఆమె అందించింది. లవ్‌ టుడే, మామన్నన్‌ చిత్రాల్లో  కీలకమైన పాత్రలో మెరిసింది. నయనతార, త్రిష, నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌, శ్రీనిధి శెట్టి, అమలా పాల్‌, రాశీ ఖన్నా, కాజల్‌ అగర్వాల్‌, సమంత వంటి స్టార్‌ హీరోయిన్‌లకు వివిధ భాషల్లో  తన గొంతు అరువిచ్చింది. (Premam Dubbing artist)


 

READ AlSO: Rashmika Mandanna: ఈసారి కూడా దేవరకొండ ఇంట్లోనేనా..



Updated Date - Nov 02 , 2024 | 08:01 AM