Vettaiyan: అక్టోబ‌ర్ 10న థియేట‌ర్ల‌లోకి.. ర‌జ‌నీకాంత్‌ ‘వేట్టైయాన్’

ABN, Publish Date - Aug 19 , 2024 | 12:14 PM

జైల‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం త‌ర్వాత సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ న‌టిస్తోన్న కొత్త చిత్రం ‘వేట్టైయాన్’. తాజాగా ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 10న భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

vettayan

జైల‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం త‌ర్వాత సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా న‌టిస్తోన్న కొత్త చిత్రం ‘వేట్టైయాన్’(Vettaiyan). సామాజిక స‌మ‌స్య‌లే ఇతివృత్తంగా తెలియ‌జేసేలా సినిమాలు తెర‌కెక్కిస్తూ విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు జై భీమ్ ఫేమ్ టీ.జె.జ్ఞాన‌వేల్ ఈ సినిమాకు ద‌ర్శ‌క్త‌వం వ‌హిస్తున్నాడు. భారీ బ‌డ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తోంది.

రోబో 2.0, ద‌ర్బార్‌, లాల్ స‌లామ్ వంటి చిత్రాల త‌ర్వాత ర‌జినీకాంత్, లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ క‌ల‌యిక‌లో రాబోతున్న నాలుగో సినిమా ‘వేట్టైయాన్’. అలాగే పేట‌, ద‌ర్బార్‌, జైల‌ర్ చిత్రాల త‌ర్వాత‌ ర‌జినీకాంత్, రాక్ స్టార్ అనిరుద్ ర‌విచంద‌ర్ క‌ల‌యిక‌లోనూ రానున్న నాలుగో సినిమా కూడా ఇదే కావ‌టం విశేషం. తాజాగా ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 10న భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.


‘వేట్టైయాన్’ చిత్రంలో భారీతారాణం కూడా న‌టిస్తుండ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ (Amitabh Bachchan) ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆస‌క్తిక‌రమైన విష‌య‌మేమంటే అంధాకానూన్‌, గిర‌ఫ్తార్‌, హ‌మ్ సినిమాల త‌ర్వాత రజినీకాంత్‌, అమితాబ్ క‌లిసి న‌టిస్తోన్న నాలుగో సినిమా ఇది. ఇంకా ఈ చిత్రంలో మంజు వారియ‌ర్‌, ఫ‌హాద్ ఫాజిల్, రానా ద‌గ్గుబాటి, రితికా సింగ్‌, దుష‌రా విజ‌య‌న్, రోహిణి, అభిరామి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

లైకా ప్రొడ‌క్ష‌న్స్ హెడ్ జికెఎం. త‌మిళ్ కుమ‌ర‌న్ ఆధ్వ‌ర్యంలో వేట్టైయాన్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఆడియెన్స్‌కు స‌రికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వ‌టానికి సిద్ధ‌మ‌వుతోన్న ఈ పాన్ ఇండియా సినిమా త‌మిళ‌, తెలుగు, హిందీ, క‌న్న‌డ భాషల్లో రిలీజ్ కానుంది.

Updated Date - Aug 19 , 2024 | 12:14 PM