Vettaiyan: చకచకా.. ‘వేట్టయాన్‌’ డబ్బింగ్‌

ABN, Publish Date - Sep 02 , 2024 | 06:39 PM

సూపర్‌స్టార్‌ రజనీకాంత్ ‘జైభీమ్‌’ ఫేం టీజే జ్ఞానవేల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘వేట్టయాన్‌’ దసరాకు సందడి చేయనుంది. దీంతో ఈ చిత్రం నిర్మాణాంతర పనులను చకచక పూర్తి చేస్తున్నారు.

vettayan

సూపర్‌స్టార్‌ రజనీకాంత్ (Rajinikanth) ‘జైభీమ్‌’ ఫేం టీజే జ్ఞానవేల్ (T. J. Gnanavel) కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘వేట్టయాన్‌’ (Vettaiyan) దసరాకు సందడి చేయనున్నారు. దీంతో ఈ చిత్రం నిర్మాణాంతర పనులను చకచక పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా, రజనీకాంత్ (Rajinikanth) తన పాత్రకు డబ్బింగ్‌ ప్రారంభించారు. ఇప్పటికే హీరోయిన్‌ మంజూ వారియర్‌ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ పూర్తి చేశారు. ఇపుడు తలైవర్‌ తన పాత్రకు డబ్బింగ్‌ చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది.

లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించే ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్ (Amitabh Bachchan), ఫహాద్‌ ఫాజిల్ (Fahadh Faasil), రానా దగ్గుబాటి (Rana Daggubati), మంజు వారియర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే, ఈ సినిమా విడుదల తేదీ సమీపిస్తుండటంతో నిర్మాణాంతర పనులను పరుగులు పెట్టిస్తున్నారు. అక్టోబరు 10న విడుదలకానున్న ఈ మూవీలో రజనీకాంత్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. అనిరుధ్‌ సంగీతం సమకూర్చుతున్న చిత్రం ఆడియో రిలీజ్‌ ఈ నెల 20వ తేదీ గ్రాండ్‌గా నిర్వహించాలని నిర్మాణ సంస్థ ఆలోచిస్తోంది.

Updated Date - Sep 02 , 2024 | 06:39 PM