40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rajinikanth: ఐశ్వర్య వ్యాఖ్యలకు రజినీ వివరణ! 

ABN, Publish Date - Jan 30 , 2024 | 12:45 PM

తలైవ రజనీకాంత్‌ వివాదాలకు కాస్త దూరంగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో పలు వివాదాలు ఆయన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఇటీవల ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌ ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్‌ సంచలనం సృష్టించింది

తలైవ రజనీకాంత్‌ (Rajinikanth)వివాదాలకు కాస్త దూరంగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో పలు వివాదాలు ఆయన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఇటీవల ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌ (Aishwarya Rajinikanth) ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్‌ సంచలనం సృష్టించింది. ఆమె వాడిన ‘సంఘి’ అనే పదం చర్చకు దారితీసింది. ఐశ్వర్య చేసిన కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీనిపై రజనీకాంత స్పందించారు. తన కూతురు ఇచ్చిన ేస్టట్‌మెంట్‌ను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని రజనీ అన్నారు.  ‘సంఘీ అనే పదం చెడ్డదని నా కూతురు ఎప్పుడూ అనలేదు అని అన్నారు. ‘లాల్‌ సలామ్‌’ ఆడియో విడుదల ఈ నెల 26న చెన్నైలో జరిగింది. ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్‌ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ వేదికపై ఐశ్వర్య మాట్లాడుతూ "ఈ మధ్యన నాన్నను చాలామంది సంఘీ (Sanghi) అని పిలుస్తున్నారు. దయచేసి అలా అనడం మానేయండి’’ అని ఆమె అన్నారు. ‘‘నేను సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటాను. కానీ, నా సహచరులు ద్వారా ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఆ సమయంలో కాస్త కోపం వస్తుంది. మనం కూడా మనుషులమే. ఇటీవల చాలా మంది మా నాన్నను సంఘీ అని పిలుస్తున్నారు. దాని అర్థం నాకు తెలియలేదు. కాబట్టి నేను దాని అర్థం విన్నాను, అర్థం చేసుకున్నాను. ఫలానా పార్టీకి మద్దతిచ్చే వారిని సంఘీ అంటారు. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేయడానికి ప్రయత్నిస్తాను. మా నాన్న సంఘీ కాదు. ఆయన సంఘీ అయితే లాల్‌ సలామ్‌ లాంటి సినిమా చేేసవారు కాదు‘ అని ఐశ్వర్య అన్నారు.

వేదికపై కూతురు మాట విన్న రజనీకాంత్‌ కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.  ఐశ్వర్య ప్రకటనపై పలువురు విమర్శలు గుప్పించారు. ఐశ్వర్య సంఘీ అంటే చెడ్డ అర్థం వచ్చేలా మాట్లాడిందని పలువురు  విమర్శించారు. ఇప్పుడు ఈ విషయంపై రజనీకాంత్‌ స్పందించారు. తాజాగా ఆయన చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నా కూతురు సంఘీ అనేది చెడ్డ పదం అని ఎప్పుడూ అనలేదు. మా నాన్నగారిని ఎందుకు అలా మాట్లాడుతున్నారు’ అని మాత్రమే అన్నది అని అన్నారు. గతేడాది ‘జైలర్‌’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రజనీకాంత్‌ లాల్‌ సలామ్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు,  ఈ సినిమా జనవరి 12న విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఫిబ్రవరి 9న విడుదల కానుంది. 


Updated Date - Jan 30 , 2024 | 12:50 PM