Dhanush: ఆస్కార్ లైబ్రరీలో... రాయన్
ABN, Publish Date - Aug 02 , 2024 | 05:17 PM
ధనుష్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందటంతో పాటు చక్కని
ధనుష్ (Dhanush) హీరోగా నటించి దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’ (Raayan). ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందటంతో పాటు చక్కని వసూళ్లు రాబడుతోంది. తాజాగా ఈ చిత్రం ఓ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన కొన్ని రోజులకే ఆస్కార్ లైబ్రరీలో చోటు దక్కించుకుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ లైబ్రరీలో ‘రాయన్’ స్క్రీన్ ప్లే శాశ్వతంగా చోటు దక్కించుకుంది. ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేస్తూ నిర్మాణసంస్థ పోస్ట్ పెట్టింది. దీంతో సినీ ప్రముఖులు ధనుష్‌కు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్‌లు పెడుతున్నారు. అద్భుతమైన స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేలకు మాత్రమే ఆస్కార్ అకాడమీ లెబ్రరీలో (oscars library) చోటు కల్పిస్తారు. గతేడాది వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’ స్క్రిప్ట్ కూడా ఆస్కార్ లైబ్రరీలో శాశ్వత స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. అలాగే తమిళ చిత్రం ‘పార్కింగ్’కి కూడా ఈ గౌరవం లభించింది. (Academy Awards library)
‘రాయన్’ ధనుష్ నటించిన 50వ చిత్రం. ఆయన దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమా. ఆయన స్వీయ దర్శకత్వంలో యాక్షన్ క్రైమ్ ఫిల్మ్‌గా రూపొందింది. ఆయన నటనను, దర్శకత్వాన్ని పలువురు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. ఇప్పుడు దీని స్ర్కీన్‌ప్లేకు ఆస్కార్ లైబ్రరీలో చోటు దక్కడంతో నెటిజన్లు శభాకాంక్షలు చెబుతున్నారు. అపర్ణా బాలమురళీ, సందీప్ కిషన్, దుషారా విజయన్ కీలక పాత్రలు పోషించారు.