Priya Bhavani Shankar: పదేళ్లగా ప్రేమ.. త్వరలో పెళ్లి!

ABN, Publish Date - Aug 08 , 2024 | 12:45 PM

పియా భవానీ శంకర్‌ (Priya Bhavani Shankar) అభిమానులకు శుభవార్త చెప్పారు. త్వరలో తన ప్రియుడితో కలిసి ఏడు అడుగులు వేస్తున్నట్లు ప్రకటించింది.

పియా భవానీ శంకర్‌ (Priya Bhavani Shankar) అభిమానులకు శుభవార్త చెప్పారు. త్వరలో తన ప్రియుడితో కలిసి ఏడు అడుగులు వేస్తున్నట్లు ప్రకటించింది. గోపీచంద్‌ 'భీమా’ (Bhima) సినిమాతో పాటు సంతోష్‌ శోభన్‌తో  'కల్యాణం కమనీయం' (Kalyanam Kamaneeyam) అనే సినిమాలో నటించిన ఈ చెన్నై బ్యూటీ నాగచైతన్య (Nagachaitanya) 'ధూత’ వెబ్‌ సిరీస్‌తో తెలుగు ఆడియన్స్ కి  చేరువైంది. ఇప్పటికే  ధనుష్‌, విశాల్‌, శింబు, కార్తి వంటి స్టార్‌లతోనూ కలిసి నటించింది.  తాజాగా 'భారతీయుడు -2’లో మెరిసింది. ఆగష్టు 15న 'డిమాంటీ కాలనీ 2' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.



తాజాగా ప్రియా భవానీ శంకర్‌ (Priya Bhavani Shankar) తాజాగా తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజ్‌ (Velraj) అనే వ్యక్తితో తాను  పదేళ్ల నుంచి రిలేషన్‌లో ఉన్నానని ప్రకటించింది. సినీ పరిశ్రమలోకి రాక ముందునుంచే రాజ్‌తో ప్రేమలో ఉన్నట్లు చెప్పింది. అయితే,  రాజ్‌తో డేటింగ్‌పై ఆసక్తి చూపుతున్న ఆమె పెళ్లి విషయంలో మాత్రం ఆలోచించడం లేదని తమిళ మీడియా పలు సందర్భాల్లో కథనాలు రాసుకొచ్చింది.  ఆమె మాట్లాడుతూ  ''నేను చాలామంది హీరోలతో కలిసి నటించడం వల్ల ఏదైనా సందర్భంలో వారికి శుభాకాంక్షలు చెబితే వెంటనే తప్పుగా ప్రచారం చేసేవారు. వారితో రిలేషన్‌లో ఉన్నానంటూ కూడా కామెంట్‌ చేశారు. లక్కీగా ఇప్పుడు వారందరికీ పెళ్లి అయిపోయింది. ఒకవేళ కళాశాల చదువు పూర్తి అయిన తరువాత పెళ్లి ప్రపోజల్‌ వచ్చి ఉంటే రాజ్‌తో ఈ పాటికే జరిగి ఉండేది. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం’’ అని అన్నారు. రాజ్‌ తన జీవితంలోకి రావడం అదృష్టం అని పేర్కొన్నారు. తను లేకపోతే ఇప్పటికీ ఒక మధ్య తరగతి కుటుంబ యువతిగా మిగిలిపోయేదాన్నని అన్నారు. రాజ్‌ అందించిన ప్రోత్సాహమే తనను ఈ స్టేజ్‌కు తీసుకొచ్చిందని ప్రియా భవానీ శంకర్‌ చెప్పారు. 

తాజాగా  సోషల్ మీడియాలో ప్రియా భవానీ శంకర్ పై  ఐరెన్ లెగ్ అనే ముద్ర వేశారు. ఏ సినిమాలో అడుగుపెడితే ఆ సినిమా ఫ్లాప్ అనే ప్రచారం ప్రారంభించారు. ఇటీవల ఆమె నటించిన  'భారతీయుడు-2'  ఫ్లాప్ అయిందనేది కోలీవుడ్ టాక్  ఈ వ్యాఖ్యల్ని ప్రియా భవానీ శంకర్ గట్టిగా తిప్పికొడుతోంది. “నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నేను ఎవర్నీ తక్కువ చేసి మాట్లాడలేదు, ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించలేదు.  నా పని నేను చేస్తున్నాను. చేసిన ప్రతి సినిమా హిట్ అవుతుందని అందరూ చెప్పలేరు కదా. ఇండియ‌న్ 2 సినిమా హిట్ కానందుకు బాధ‌గా ఉంది. కానీ ఆ సినిమాలో నాకు అవకాశం రావడం చాలా పెద్ద విషయం. అయితే కొందరు నన్ను బాధపెట్టేలా మాట్లాడుతున్నారు. భారతీయుడు-2 సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పుడు ఎంత సంతోషించానో.. ఇప్పుడు అంత బాధపడుతున్నాను"  చెప్పుకొచ్చింది ప్రియా భవానీ శంకర్.  

Updated Date - Aug 08 , 2024 | 01:17 PM