Prithviraj Sukumaran: వా.. ఇది కదా అప్డేట్ అంటే.. ‘లూసిఫర్ 2’ పృథ్వీరాజ్ లుక్

ABN, Publish Date - Oct 16 , 2024 | 01:53 PM

మోహ‌న్ లాల్‌, వెర్స‌టైల్ యాక్ట‌ర్‌, డైరెక్ట‌ర్ 'పృథ్వీరాజ్ సుకుమార్' (Prithviraj Sukumaran) కాంబినేష‌న్‌లో రానున్న మూడో చిత్రం కావ‌టంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశన్నంటాయి.

Prithviraj Sukumaran in Lucifer 2

మలయాళ నేచురల్ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) నటించిన మూవీ ‘లూసిఫర్’ (Lucifer) 2019లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘L2 ఎంపురాన్’ (Empuran) రాబోతోంది. స్టార్ హీరోల‌తో భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మించే చిత్ర నిర్మాణ సంస్థ‌ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది మోహ‌న్‌లాల్‌తో పాటు ఈ చిత్రంలో ఇతర స్టార్‌ హీరోలు నటిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ హిట్ కావ‌టంతో సినిమాపై ఎలాంటి అంచ‌నాలున్నాయో ముందుగానే అంచ‌నా వేసిన మేక‌ర్స్ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మించేలా సినిమాను నిర్మిస్తున్నారు. మోహ‌న్ లాల్‌, వెర్స‌టైల్ యాక్ట‌ర్‌, డైరెక్ట‌ర్ 'పృథ్వీరాజ్ సుకుమార్' (Prithviraj Sukumaran) కాంబినేష‌న్‌లో రానున్న మూడో చిత్రం కావ‌టంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశన్నంటాయి.


మోహ‌న్‌లాల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘L2 ఎంపురాన్’ లో ఖురేషి అబ్ర‌మ్‌గా సూప‌ర్‌స్టార్ లుక్‌ను విడుద‌ల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమార్ బర్త్ డే సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఖురేషి అబ్రమ్‌కు రైట్ హ్యాండ్‌లా జయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమార్ కనిపించనున్నారు. తాజాగా రిలీజ్ చేసిన జయేద్ మసూద్ కారెక్టర్ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఎంపరర్ జనరల్ అంటూ జయేద్ మసూద్ పాత్రను పరిచయం చేశారు. ఈ చిత్రంలో టోవినో థామ‌స్‌, మంజు వారియ‌ర్‌, నందు, సానియా అయ్య‌ప్ప‌న్ త‌దిత‌రులు మ‌రోసారి వారి పాత్ర‌ల‌తో మెప్పించ‌బోతున్నారు.


లడఖ్, చెన్నై, కొట్టాయం, యుఎస్ మరియు యుకెతో సహా ప‌లు చోట్ల సినిమా చిత్రీకరణ జరిగింది. టీమ్ ప్రస్తుతం తిరువనంతపురంలో షూటింగ్ జరుపుకుంటోంది. త్వ‌ర‌లోనే గుజరాత్, యుఎఇకి కూడా టీమ్ వెళ్లనుంది. 2025లో మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో సినిమాను విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగాన్ని 2022లో డైరెక్టర్ 'మోహన్ రాజా'.. తెలుగులో మెగాస్టార్ 'చిరంజీవి'తో (Mega Star Chiranjeevi) 'గాడ్‌ఫాదర్‌' (Godfather) గా నిర్మించిన విషయం తెలిసిందే.

Also Read- Sai Durgha Tej: మేనమామ పవన్ కళ్యాణ్ ఆశీస్సులు వచ్చేశాయ్

Also Read- Jr NTR: ‘దేవర’ ప్రీ రిలీజ్ వేడుక, సక్సెస్ మీట్ లేకపోవడంతో.. తారక్ ఏం చేశారంటే

Also Read- RGV: సల్మాన్‌లో చావు భయం..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 16 , 2024 | 02:14 PM