Pranita Subhash: శ్రీవారి లడ్డూ ప్రసాదం.. బాపుబొమ్మ స్పందన
ABN, Publish Date - Sep 20 , 2024 | 11:31 AM
భారత సంస్కృతి, సంప్రదాయాలను, ఆధ్యాత్మికత, మన విలువల గురించి తరచూ సోషల్ మీడియా వేదికగా మాట్లాడే ప్రణీత (Pranita Subhash) తాజాగా తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు
తిరుమల లడ్డూ (Tirumala laddu)తయారీపై పెద్ద చర్చే జరుగుతోంది. భారత సంస్కృతి, సంప్రదాయాలను, ఆధ్యాత్మికత, మన విలువల గురించి తరచూ సోషల్ మీడియా వేదికగా మాట్లాడే ప్రణీత (Pranita Subhash) తాజాగా తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు. దానిపై వస్తోన్న వార్తలను భక్తులు ఏమాత్రం ఊహించలేనివి అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘శ్రీవారి లడ్డూ తయారీలో జంతు కొవ్వు వినియోగించడం దారుణం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా. ఇది శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు కలలో కూడా ఊహించనిది’ అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా పలువురు నెటిజన్లు దీనిపై స్పందిస్తున్నారు. ఈ వివాదంపై మొదటిగా స్పందించినందుకు ఆమెను అభినందిస్తున్నారు. మరోవైపు తిరుమల శ్రీవారి లడ్డూ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. తిరుమల, శ్రీవారి మహా ప్రసాదం లడ్డూల తయారీలో పెద్దఎత్తున కల్తీ జరిగిందని, అందులో పాలకు బదులు ఇతరత్రా కొవ్వు కలగలిసి ఉన్నట్లు గుజరాత్‌కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ) కాఫ్ లిమిటెడ్ సంస్థ అనుమానం వ్యక్తంచేసింది. లడ్డూ తయారీలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలిసి ఉండొచ్చని పేర్కొంది.