LIC కాదు LIK: ప్రదీప్‌ రంగనాథన్, కృతిశెట్టి సినిమా పేరు మార్పు

ABN, Publish Date - Jul 26 , 2024 | 02:27 PM

విఘ్నేష్‌ శివన్ దర్శకత్వంలో ప్రదీప్‌ రంగనాథన్, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎల్‌ఐసి’ (లవ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌). తాజాగా ఈ సినిమా టైటిల్ మారింది.

lik

విఘ్నేష్‌ శివన్ (Vignesh Shivan) దర్శకత్వంలో ప్రదీప్‌ రంగనాథన్ (Pradeep Ranganathan), కృతిశెట్టి (Krithi Shetty) జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎల్‌ఐసి’(LIc) (లవ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌). ఈ సినిమా టైటిల్‌ మారింది. ‘లవ్‌ ఇన్సూరెన్స్ కంపేనీ’ (LIK)గా టైటిల్‌ ఖరారు చేసినట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ సినిమా టైటిల్‌ మార్చడానికి కారణం లేకపోలేదు.

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ తమ సంస్థ పేరు సినిమా టైటిల్‌గా ఉపయోగించేందుకు అనుమతించలేదు. చిత్ర బృందానికి నోటీసులు పంపింది. దీంతో దర్శకనిర్మాతలు వెనక్కితగ్గి, తమ చిత్రం పేరును ‘లవ్‌ ఇన్సూరెన్స్ కంపేనీ’ (LIK) గా మార్పు చేసేందుకు ముందుకు వచ్చారు. దీనికి సంబంధించిన అధికారికంగా ప్రకటన చేశారు.


కాగా.. ప్రదీప్‌ రంగనాథన్‌ ‘లవ్‌టుడే’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీ తర్వాత నటిస్తున్న సినిమా ఇది. జనవరి నుంచి చిత్రీకరణ జరుపుకుంటోంది. ఎస్‌జే సూర్య (S J Suryah), యోగిబాబు (Yogi Babu) ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నటి నయనతారకు చెందిన రౌడీ పిక్చర్స్‌తో కలిసి 7 స్క్రీన్‌ స్టూడియోపై నిర్మాత లలిత్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Updated Date - Jul 26 , 2024 | 02:27 PM