40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నటుడు సురేశ్ గోపి కూతురు వివాహం.. దగ్గరుండి జరిపించిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్

ABN, Publish Date - Jan 17 , 2024 | 02:58 PM

మ‌ళ‌యాళ అగ్ర న‌టుడు, మాజీ రాజ్యసభ ఎంపీ సురేశ్‌గోపి కూతురు పెళ్లి కేరళ త్రిసూర్ జిల్లా గురువాయూర్ లోని శ్రీకృష్ణుని ఆలయంలో బుధవారం వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ ఈ వివాహానికి హజరయ్యారు.

MODI,SURESH GOPI

మ‌ళ‌యాళ అగ్ర న‌టుడు, మాజీ రాజ్యసభ ఎంపీ సురేశ్‌గోపి (Suresh Gopi) కూతురు పెళ్లి కేరళ త్రిసూర్ జిల్లా గురువాయూర్ (Guruvayoor) లోని శ్రీకృష్ణుని ఆలయంలో బుధవారం వైభవంగా జరిగింది.కేరళలో రెండు రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఈ వివాహానికి హజరై వధూవరులకు పూల దండలు ఇవ్వగా వారు మోడీ సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.


ఈ కార్యక్రమానికి మళయాళ ఇండస్ట్రీ అగ్ర నటులు మమ్ముట్టి, మోహన్ లాల్, దిలీప్, జయరాం, ఖుష్బూ వంటి వారు హజరై నూతన జంటను ఆశీర్వదించారు. అనంతరం ప్రధాని మోదీ గురువాయూర్ (Guruvayoor) ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, తామర మొగ్గలతో తులాభారం (నైవేద్యం) నిర్వహించారు. అదే సమయంలో ఆలయంలో వివాహం చేసుకున్న మరో 10 జంటలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jan 17 , 2024 | 03:12 PM