Pawan Kalyan: ఢిల్లీ గణేష్ మరణం.. ప్రధాని మోడి, పవన్ సహా పలువురు సంతాపం
ABN, Publish Date - Nov 10 , 2024 | 05:59 PM
కోలీవుడ్ విలక్షణ నటుడు ఢిల్లీ గణేష్ (Delhi Ganesh) అనారోగ్య కారణాలతో ఆదివారం తెల్లవారుజామున కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (pawan Kalyan) సంతాపం ప్రకటించారు.
కోలీవుడ్ విలక్షణ నటుడు ఢిల్లీ గణేష్ (Delhi Ganesh) అనారోగ్య కారణాలతో ఆదివారం తెల్లవారుజామున కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (pawan Kalyan) సంతాపం ప్రకటించారు. ఆయన మరణ వార్త కలచివేసిందన్నారు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు. (Pawan Kalyan Condolence to Delhi ganesh)
‘‘ప్రముఖ నటుడు ఢిల్లీ గణేశ్ మృతి విచారకరం. దాదాపు 400 చిత్రాల్లో నటించి, తన అద్భుత నటనా ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. భారత వైమానిక దళంలో విధులు నిర్వర్తించి.. దేశభక్తిని చాటుకున్నారు. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’ అని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ఆయనతోపాటు పలువురు స్టార్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.
కాగా నటుడు డిల్లీ గణేశ్ మరణంపై ప్రధాని మోడి సంతాపం తెలుపుతూ ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన సినిమా రంగానికి చేసిన సేవలను కొనియాడారు.
‘‘నా స్నేహితులు ఢిల్లీ గణేష్ అద్భుతమైన వ్యక్తి. గొప్ప నటుడు. ఆయన మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి’’ – రజనీకాంత్
‘‘ఢిల్లీ గణేశ్ అద్భుతమైన నటుడు. సర్.. ఇకపై మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతాం. ఓం శాంతి’’ – మాధవన్
‘‘తమిళ చిత్రపరిశ్రమకు చెందిన గొప్ప నటుల్లో ఢిల్లీ గణేశ్ ఒకరు. ఆయన మరణ వార్త తీవ్రంగా బాధించింది. చిత్రపరిశ్రమకు తీరని లోటు ఇది. ఆయన కుటుంబ సభ్యులకు, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ – విజయ్ సేతుపతి.