Parvathy Thiruvothu : ఏజెంట్ హనీ.. మైండ్ బ్లోయింగ్: పార్వతి తిరువోతు
ABN, Publish Date - Nov 28 , 2024 | 09:26 PM
‘సిటడెల్: హనీ బన్నీ.(Citadel) సిరీస్ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా దీనిని మలయాళీ నటి పార్వతీ తిరువోతు వీక్షించారు. తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ పెట్టారు. సిరీస్ అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.
అగ్ర కథానాయిక సమంత (Samantha)నటించిన వెబ్ సిరీస్ ‘సిటడెల్: హనీ బన్నీ.(Citadel) రాజ్ అండ్ డీకే (Raj and Dk) దర్శకత్వం వహించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా దీనిని మలయాళీ నటి పార్వతీ తిరువోతు వీక్షించారు. తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ పెట్టారు. సిరీస్ అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. ఏజెంట్ హనీగా సామ్ నటన మైండ్ బ్లోయింగ్ అని అన్నారు. ‘‘ఎప్పటి నుంచో ఈ సిరీస్ చూడాలనుకుంటున్నా. కాకపోతే ఆలస్యమైంది. సిరీస్ అద్భుతంగా ఉంది. దీనిని చూసి నేను ఆశ్చర్యానికి గురయ్యా. ఏజెంట్ హనీ (సమంత) నువ్వు నిజంగానే ఒక ఫైర్. అద్భుతంగా యాక్ట్ చేశావు. నిన్ను ఇలాంటి పాత్రల్లో చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేశావు’’ అని పేర్కొన్నారు. దీనిపై సమంత ఆనందం వ్యక్తం చేశారు. పార్వతి పోస్ట్‌ను సామ్ షేర్ చేశారు. థాంక్యూ సో మచ్ పార్వతి అని రాసుకొచ్చారు.
స్పై, యాక్షన్ థ్రిల్లర్‌గా ‘సిటడెల్: హనీ బన్నీ’ తెరకెక్కింది. దీని కోసం సమంత, వరుణ్ ధావన్‌్ మొదటిసారి కలిసి పనిచేశారు. ఇప్పటికే సమంత, వరుణ్ ధావన్ నటనకు సినీ ప్రముఖులు నెటిజన్ల ప్రశంసలు దక్కాయి.
ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో స్ట్రీమింగ్ అవుతుండగా. 150 దేశాల్లో టాప్‌లో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించడంతో దర్శకులు ఆనందం వ్యక్తం చేశారు.