40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nivetha Pethuraj: ప్రస్తుతానికి బ్యాడ్మింటన్ .. వాట్‌ నెక్ట్స్‌! 

ABN, Publish Date - Jan 23 , 2024 | 04:34 PM

నటన వృత్తిగా వచ్చిన ప్రతి కథనాయికలోనూ నటనతోపాటు మరో టాలెంట్‌ ఉండక మానదు. ఒక్కో హీరోయిన్లో  ఒక్కో ప్రతిభ ఉంటుంది. కొందరు తారలు నటనలో కొనసాగుతూనే చదువుపై శ్రద్ధ పెడుతుంటారు. మరికొందరు వ్యాపారంపై దృష్టి సారిస్తుంటారు. మరికొందరు స్పోర్ట్స్‌ వంటి యాక్టివిటీస్‌లో ప్రతిభను చూపిస్తుంటారు.

నటన వృత్తిగా వచ్చిన ప్రతి కథనాయికలోనూ నటనతోపాటు మరో టాలెంట్‌ ఉండక మానదు. ఒక్కో హీరోయిన్లో  ఒక్కో ప్రతిభ ఉంటుంది. కొందరు తారలు నటనలో కొనసాగుతూనే చదువుపై శ్రద్ధ పెడుతుంటారు. మరికొందరు వ్యాపారంపై దృష్టి సారిస్తుంటారు. మరికొందరు స్పోర్ట్స్‌ వంటి యాక్టివిటీస్‌లో ప్రతిభను చూపిస్తుంటారు. అవి టైమ్‌ వచ్చినప్పుడు బయటపడుతుంటాయి. తాజాగా తనలో ఉన్న టాలెంట్‌ను బయటపెట్టారు టాలీవుడ్‌
హీరోయిన్  నివేతా పేతురాజ్‌(Nivetha Pethuraj). నటన-మోడలింగ్‌లో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. కొన్నాళ్ల ముందు కారు రేసింగ్‌ నేర్చుకుంది. అప్పట్లో రేసు ట్రాక్‌ మీద కారులో ఉన్న ఫొటోలు వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా ప్రొఫెషనల్‌ షట్లర్‌లా మారిపోయింది. మధురైలో జరిగిన బ్యాడ్మింటన్  ఛాంపియన్‌షిప్‌ పోటీలోని మిక్స్‌డ్‌ డబుల్స్‌ కేటగిరీలో కప్‌ కొట్టింది. ఈ విషయాన్ని ఆమె ఇనస్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అంతే కాదు  ‘వాట్‌ నెక్ట్స్‌?’ అనే ఓ క్యాప్షన్‌ పెట్టింది. అయితే మళ్లీ ఏదో పోటీలో పాల్గొనబోతోందని తెలుస్తోంది. 

తమిళనాడుకు చెందిన నివేతా పేతురాజ్‌.. 2016లో ఇండస్ట్రీ లోకి వచ్చింది. ఆ తర్వాత ఏడాదే  ‘మెంటల్‌ మదిలో’ అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, రెడ్‌, పాగల్‌, విరాటపర్వం తదితర సినిమాల్లో నటించింది. అయితే ఆమెకు రావలసిన పేరు రాలేదు. అవకాశాలు వస్తున్నా సరైన విజయం దక్కడం లేదు. 

Updated Date - Jan 23 , 2024 | 04:39 PM