Nayanthara: ‘మూక్కుత్తి అమ్మన్’ పార్ట్ 2 దర్శకుడెవరంటే
ABN, Publish Date - Sep 19 , 2024 | 09:56 PM
స్టార్ హీరోయిన్ నయనతార నటించిన ‘మూక్కుత్తి అమ్మన్’ చిత్రం రెండో భాగం త్వరలోనే తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాత ఐసరి డాక్టర్ కె.గణేశ్ తన సొంత నిర్మాణ సంస్థ వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పతాకంపై నిర్మించనున్నారు. మొదటి పార్ట్ ఆర్జె బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కగా.. పార్ట్ 2కి మరో దర్శకుడిని నిర్మాణ సంస్థ ఫైనల్ చేసింది. ఆ దర్శకుడు ఎవరంటే..
స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara) నటించిన ‘మూక్కుత్తి అమ్మన్’ (Mookuthi Amman) చిత్రం రెండో భాగం త్వరలోనే తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాత ఐసరి డాక్టర్ కె.గణేశ్ తన సొంత నిర్మాణ సంస్థ వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పతాకంపై నిర్మించనున్నారు. 2020లో రేడియో జాకీ ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ‘మూక్కుత్తి అమ్మన్’ చిత్రం తొలిభాగం వచ్చి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నయనతార, ఆర్జే బాలాజీ, ఊర్వశి, స్మృతి వెంకట్, మయిల్సామి, తదితరులు నటించారు. ఇప్పుడీ సినిమా రెండో భాగాన్ని వేల్స్ నిర్మాణ సంస్థ చేపట్టింది. ‘మూక్కుత్తి అమ్మన్’ రెండో భాగాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారనే దానిపై ఓ క్లారిటీ వచ్చేసింది. వేల్స్ నిర్మాణ సంస్థ ఈ పార్ట్ 2 డైరెక్ట్ చేసే దర్శకుడిని అధికారికంగా ప్రకటించింది.
Also Read- NagaBabu: నాగబాబు కొటేషన్స్.. కొరియోగ్రాఫర్ కోసమేనా
ఆ దర్శకుడు మరెవరో కాదు.. సుందర్ సి (Sundar C). ఆయన దర్శకత్వంలో త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది. సుందర్ సి పేరు వినబడగానే.. ఈ సినిమాపై భారీగా అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికే స్ర్కిప్ట్ లాక్ చేశారని, మంచి ముహుర్తం చూసుకుని షూటింగ్ మొదలు పెట్టనున్నారని కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, సుందర్ దర్శకత్వంలో రీసెంట్గా వచ్చిన ‘అరణ్మనై-4’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సుందర్ సి.. హాస్య నటుడు వడివేలు హీరోగా ‘గ్యాంగర్స్’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని సమాచారం. ‘మూక్కుత్తి అమ్మన్’ తెలుగులో ‘అమ్మోరు తల్లి’ పేరుతో విడుదలై మంచి ఆదరణను రాబట్టుకుంది.
Also Read- Poonam Kaur: అప్పట్లో నా మాట పట్టించుకోలేదు.. త్రివిక్రమ్ పై పూనమ్ సంచలన వ్యాఖ్యలు
Read Latest Cinema News