Nayanthara: అలాంటి ప్రయత్నం చేయలేదు.. ఆ అవసరం లేదు

ABN, Publish Date - Oct 28 , 2024 | 11:45 AM

హీరోయిన్లు తాము చేసే సినిమాల గురించే కాకుండా ఇతర విషయాలపైనా వార్తల్లో నిలుస్తుంటారు. అందులో వారి ప్రమేయం ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఒక్కోసారి ఏ సంబంధం లేకుండానే వార్తలకెక్కుతారు. తాజాగా అలాంటి వార్తలపై నయనతార మండిపడ్డారు.

హీరోయిన్లు తాము చేసే సినిమాల గురించే కాకుండా ఇతర విషయాలపైనా వార్తల్లో నిలుస్తుంటారు. అందులో వారి ప్రమేయం ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఒక్కోసారి ఏ సంబంధం లేకుండానే వార్తలకెక్కుతారు. తాజాగా అలాంటి వార్తలపై నయనతార (Nayanathara) మండిపడ్డారు. తాను ప్లాస్టిక్‌ సర్జరీ (Plastic surgey) చేయించుకున్నట్లు గతంలో వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. దేవుడు ఇచ్చిన తన ముఖాన్ని మార్చుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించలేదని, ఆ ఆలోచన కూడా రాలేదని తెగేసి చెప్పారు. నయన్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొన్నాళ్ల తర్వాత పలు చిత్రాల్లో ఆమె ముఖం తొలి సినిమాలో కంటే సన్నగా కనిపించింది. దీంతో ఆమె ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నారనే రూమర్స్‌ మొదలయ్యాయి. తాజాగా నయనతార వాటికి ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ఆదివారం ఇచ్చిన ఓ ఇంటర్వూలో ఆమె దీనిపై మాట్లాడారు.



‘‘నా కనుబొమ్మలు అంటే నాకు చాలా ఇష్టం. వాటి ఆకారం ఎప్పుడూ మారుస్తూ ఉంటాను. ప్రతి రెడ్‌ కార్పెట్‌ ఈవెంట్లకు ముందు వాటిని మార్చుతుంటాను. వాటి కోసం ఎంతో సమయాన్ని కేటాయిస్తాను. కనుబొమ్మల ఆకారం మారినప్పుడల్లా ముఖంలో మార్పు కనిపిస్తుంది. బహుశా అందుకే నా ముఖంలో మార్పులు వచ్చాయని ప్రజలు అనుకొని ఉంటారు. వాళ్లు అనుకున్నది నిజం కాదు.. అలాగే డైటింగ్‌ వల్ల కూడా నా ముఖంలో మార్పులు రావచ్చు. ఒక్కోసారి బుగ్గలు వచ్చినట్లు కనిపిస్తుంటాయి. ఇంకోసారి అవి లోపలికి వెళ్లినట్లు అనిపిస్తుంటుంది. కావాలంటే మీరు నన్ను గిచ్చి చూడొచ్చు.. నా శరీరంలో ఎక్కడా ప్లాస్టిక్‌ ఉండదు’’ అని నయనతార అన్నారు. ప్రస్తుతం ఆమె కోలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ బిజీ అయ్యారు. గతేడాది 3 సినిమాలతో అలరించిన నయన్‌ ప్రస్తుతం ఐదు సినిమాలతో బిజీగా ఉన్నారు.  

Read Also: Suriya: టాలీవుడ్‌ హీరోలపై సూర్య కామెంట్స్‌



Updated Date - Oct 28 , 2024 | 12:03 PM