Nadigar Sangam: 8న నడిగర్‌ సంఘం 68వ సర్వసభ్య సమావేశం

ABN, Publish Date - Aug 19 , 2024 | 12:30 PM

దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్‌ సంఘం) 68వ సర్వసభ్య సమావేశం వచ్చే నెల 8వ తేదీ జరుగనుంది. తేనాంపేటలోని కామరాజర్‌ అరంగంలో జరిగే ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులు, సాధరణ సభ్యులంతా పాల్గొననున్నారు.

nadigharsangham

దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్‌ సంఘం) Nadigar Sangam 68వ సర్వసభ్య సమావేశం వచ్చే నెల 8వ తేదీ జరుగనుంది. తేనాంపేటలోని కామరాజర్‌ అరంగంలో జరిగే ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు నాజర్‌, ప్రధాన కార్యదర్శి విశాల్‌, కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షులు పూచ్చి మురుగన్‌, కరుణాస్‌ సహా ఆ సంఘం ఇతర కార్యవర్గ సభ్యులు, సాధరణ సభ్యులంతా పాల్గొననున్నారు.

ఇందులో పలువురు తమిళ హీరోలకు, తమిళ సినీ నిర్మాతల సంఘానికి మధ్య నెలకొన్న వివాదం, ఇటీవల నిర్మాతల మండలి తీసుకున్న పలు వివాదాస్పద, సంచలన నిర్ణయాలపై చర్చించనున్నారు. ముఖ్యం గా నిర్మాతల సంఘంతో ఉన్న సమస్యలన్నింటినీ చర్చించి పరిష్కరించుకునేలా నడిగర్‌ సంఘం ఆసక్తి చూపుతోంది.


ఇందుకోసం సెప్టెంబరు 8వ తేదీన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని సంఘ కార్యవర్గం నిర్ణయించింది. అలాగే, సర్వసభ్య సమావేశంలో స్టార్‌నైట్‌ నిర్వహించి నిధుల సేకరణ, నడిగర్‌ సంఘం భవన నిర్మాణం, భవిష్యత్‌ ప్రణాళిక తదితర అంశాలపై చర్చించనున్నారు.

Updated Date - Aug 19 , 2024 | 12:30 PM