Mohan Lal: సైనికులతో కలిసి వయనాడ్ బాధితుల చెంతకు
ABN, Publish Date - Aug 03 , 2024 | 12:28 PM
వయనాడ్ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు హీరో మోహన్‌లాల్ ముందుకొచ్చారు. శనివారం ఆయన టెరిటోరియల్ ఆర్మీ బేస్ క్యాంపునకు చేరుకున్నారు. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా ఉన్న మోహన్‌లాల్.. విపత్తు సంభవించిన ప్రాంతాన్ని సందర్శించి సైనికులతో సమావేశం అయ్యారు.
వయనాడ్ (Wayanad)ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు హీరో మోహన్‌లాల్ (Mohanlal) ముందుకొచ్చారు. శనివారం ఆయన టెరిటోరియల్ ఆర్మీ బేస్ క్యాంపునకు చేరుకున్నారు. టెరిటోరియల్ ఆర్మీలో (Indian Territorial Army) లెఫ్టినెంట్ కల్నల్‌గా ఉన్న మోహన్‌లాల్(Lieutenant Colonel) . విపత్తు సంభవించిన ప్రాంతాన్ని సందర్శించి సైనికులతో సమావేశం అయ్యారు కోజికోడ్ నుంచి రోడ్ మార్గంలో వయనాడ్‌కు చేరుకుని ఆర్మీ అధికారులతో చర్చలు జరిపారు. సంబంధిత ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు (Landslides) విరిగిపడిన ఘటనలో ఎంతోమంది మృతిచెందడం యావత్ దేశాన్ని కలచివేస్తోంది. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రకృతి విలయంతో అతలాకుతలమైన వయనాడ్‌లో మలయాళ నటుడు మోహన్‌లాల్ పర్యటించారు. ఈ నేపథ్యంలో పర్యటన నిమిత్తం మెప్పాడి చేరుకున్న మోహన్‌లాల్, అక్కడ అధికారులతో మోహన్‌లాల్ భేటీ అయ్యారు. (Mohan lal with Army Uniform) Lieutenant Colonel,
అనంతరం ముండకే్ౖక, చుర్‌ము లాల్ సహా కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కూడా మోహన్‌లాల్ పరామర్శించనున్నారు. ఇక ఇప్పటికే బాధితులను ఆదుకునేందుకు మోహన్ లాల్.. కేరళ సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళంగా అందించారు. ఈ క్రమంలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం తో పాటు దేశవ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు నటులు సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీగా విరాళాలు ఇచ్చారు. కమల్‌హాసన్ రూ.25 లక్షలు విరాళం అందించారు. ఆచూకీ గల్లంతైన వారిని గుర్తించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎక్కడెక్కడ ఎవరు చిక్కుకుపోయారో తెలుసుకునేందుకు డ్రోన్లు, రాడార్లు, మొబైల్ ఫోన్ల సిగ్నళ్ల ద్వారా ముమ్మర ప్రయత్నం జరుగుతోంది. ఇంకా వందల మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది.