మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Meera Jasmine: మీరా జాస్మిన్  ఇంట విషాదం

ABN, Publish Date - Apr 04 , 2024 | 07:23 PM

'గుడుంబా శంకర్‌’ ఫేం మీరా జాస్మిన్‌ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్‌ ఫిలిప్‌ (83) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు.

'గుడుంబా శంకర్‌’ (gudumba shankar) ఫేం మీరా జాస్మిన్‌ (Meera Jasmine) ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్‌ ఫిలిప్‌ (83) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. వృద్థాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఎర్నాకులం లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. దీంతో మీరా జాస్మిన్‌ ఇంట విషాదచాయలు నెలకొన్నాయి. జోసెఫ్‌ ఫిలిప్‌కు (joseph) భార్య ఎలియమ్మ, సారా, జేని, జార్జ్‌, జాయ్‌, మీరా అని ఐదుగురు సంతానం ఉన్నారు. వీరిలో మీరా జాస్మిన్‌ అందరిలో కంటే చిన్నది.


మీరా జాస్మిన్‌.. సూత్రధారన్ అనే మలయాళ సినిమాతో కెరీర్‌ ప్రారంభించింది. రన్‌ సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. అమ్మాయి బాగుంది చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.  పందెం కోడి, గుడుంబా శంకర్‌, భద్ర, రారాజు, మహారథి, యమగోళ మళ్లీ మొదలైంది, గోరింటాకు, మా ఆయన చంటి పిల్లాడు.. వంటి చిత్రాల్లో నటించారు. 2014లో దుబాయ్‌ ఇంజనీర్‌ అనిల్‌ జాన్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. గతేడాది విమానం చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది.

Updated Date - Apr 04 , 2024 | 07:23 PM