Samriddhi Tara: కోలీవుడ్‌లోకి.. మ‌రో మాలీవుడ్‌ బ్యూటీ

ABN, Publish Date - Sep 17 , 2024 | 07:27 AM

మాలీవుడ్‌కు చెందిన సమృద్ధి తార అనే హీరోయిన్‌ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. తమిళంలో తెరకెక్కుతున్న ‘మైయల్‌’ చిత్రంలో ఆమె కథానాయికగా చేస్తోంది.

Samriddhi Tara

త‌మిళ‌నాట మ‌ల‌యాళి భామ‌ల హ‌వా పుల్ స్పీడ్‌లో ఉంది. ఇప్ప‌టికే న‌య‌న‌తార ఆగ్ర స్థానంలో దూసుకెళుతుండ‌గా ఇటీవ‌ల అన్నాబెన్‌, పార్వ‌తి తిరుమోతు, మంజూ వారియ‌ర్‌, సాయి ప‌ల్ల‌విలు వ‌రుస ఛాన్సులు ద‌క్కించుకుంటున్నారు. ఈక్ర‌మంలో ఈ జాబితాలో మ‌రో న‌టి వ‌చ్చి చేరింది.

మ‌ల‌యాళంలో ఇప్పుడిప్పుడే అవ‌కాశాలు అందిపుచ్చుకుంటున్న స‌మృద్థి తార (Samriddhi Tara) త‌మిళ నాట హీరోయిన్‌గా ఆరంగేట్రం చేస్తోంది. తమిళంలో తెరకెక్కుతున్న ‘మైయల్‌’ (Myyal) చిత్రంలో ఆమె కథానాయికగా చేస్తోంది. ఎమోషనల్‌ డ్రామాగా రూపొందుతున్న తన మొదటి కోలీవుడ్‌ చిత్రంలోనే ఒక మంచి ప్రామిసింగ్‌ క్యారెక్టర్‌ లభించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేసింది.

ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమృద్ధి అటు మలయాళంలో రాణిస్తూ, ఇపుడు కోలీవుడ్‌లో తన ప్రతిభ నిరూపించుకునేందుకు ఉవ్విళ్ళూరుతుంది. ‘మైయల్‌’ (Myyal) చిత్రంలో నటించిన అనుభూతిపై ఆమె స్పందిస్తూ, ‘ఈ చిత్రంలో సమకాలీన వాస్తవికతతో కూడిన అనేక అంశాలు ప్రతిధ్వనించేలా భావోద్వేగాలున్నాయి. ఇలాంటి సినిమాలో నటించేందుకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని పేర్కొన్నారు.

Updated Date - Sep 17 , 2024 | 07:27 AM