Malavika Menon: కథ డిమాండ్ చేస్తే.. ఎక్స్‌పోజింగ్, ముద్దు సన్నివేశాలు చేస్తా
ABN, Publish Date - Jun 27 , 2024 | 10:02 AM
మలయాళంలో గ్లామర్ పాత్రలకు అవకాశం లేదని, కానీ తమిళం, తెలుగు భాషల్లో ఉంటుందని హీరోయిన్ మాళవిక మేనన్ అన్నారు. ఇటీవల ఈ భామ నటించిన రెండు మలయాళ చిత్రాలు విడుదలై మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర విషయాలను పంచుకుంది.
మలయాళంలో గ్లామర్ పాత్రలకు అవకాశం లేదని, కానీ తమిళం, తెలుగు భాషల్లో మాత్రం ఉందని హీరోయిన్ మాళవిక మేనన్ (Malavika Menon)అన్నారు. 2011లో మలయాళ సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఇప్పటివరకు 60పైనే సినిమాల్లో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి పేరు తెచ్చుకుంది. ఇటీవల ఈ భామ నటించిన రెండు మలయాళ చిత్రాలు తంకమణి (Thankamani), వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ కొచ్చి (Once Upon a Time in Kochi) విడుదలై మంచి గుర్తింపును తీసుకువచ్చాయి.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన సినీ జీవితం గురించి ఆమె మాట్లాడుతూ, ‘నేను తొలిసారి నటించిన చిత్రం ‘నిద్ర’. అపుడు నా వయసు 14 యేళ్ళు. హీరో చెల్లి పాత్రలో నటించాను. ‘916’ అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమయ్యాను. తొలిసారి హీరోయిన్‌గా నటించే సమయంలో అనేక సమస్యలతో పాటు సవాళ్లను కూడా ఎదుర్కొన్నా అన్నారు.
మలయాళంలో గ్లామర్ పాత్రలకు అవకాశం లేదు. కానీ, తమిళం, తెలుగు భాషా చిత్రాల్లో మాత్రం నటించవచ్చు. ఎక్స్‌పోజింగ్ బాగా చేసే పాత్రలు లభిస్తాయి. అలాగే, ఇప్పటివరకు ముద్దు సన్నివేశాల్లో నటించలేదు. కథ డిమాండ్ చేస్తే, ఆ పాత్ర లేదా సన్నివేశం ప్రజాదారణ పొందుతుందని భావిస్తే ఖచ్చితంగా నటిస్తానని పేర్కొన్నారు.
ఇదిలాఉండగా ఈ అమ్మడు తెలుగులో ఎనిమిదేండ్ల క్రితమే హీరోయిన్‌గా రెండు సినిమాలు చేయగా ఇప్పటికీ అవి రిలీజ్ కాకపోవడం గమనార్హం.
అందులో ఒకటి ఈ మధ్య సిద్ధార్థ్ రాయ్ సినిమాతో పేరు తెచ్చుకున్న దీపక్ సరోజ్‌తో 2016లో లవ్ కే రన్ (Love K Run), 2018లో అమ్మాయిలు అంతే అదో టైపు (Ammailu Anthe Ado Type) అనే చిత్రాల్లో నటించింది.