Bramayugam: మమ్ముట్టి ‘భ్రమయుగం’ చిత్రం విడుదలపై కీలక ప్రకటన
ABN, Publish Date - Feb 13 , 2024 | 05:15 PM
మమ్ముట్టి ప్రధాన పాత్రలో ‘భూతకాలం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వంలో నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర అండ్ ఎస్.శశికాంత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మలయాళ చిత్రం ‘భ్రమయుగం’. ఈ సినిమాను ఇటీవల ఫిబ్రవరి 15న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మలయాళంలో మాత్రమే ఈ సినిమాను ఆ తేదీన విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. వైవిధ్యమైన చిత్రాలతో ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తోన్న మమ్ముట్టి.. ఇప్పుడు మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమయ్యారు. మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో ‘భూతకాలం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వంలో నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర అండ్ ఎస్.శశికాంత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మలయాళ చిత్రం ‘భ్రమయుగం’ (Bramayugam). హారర్-థ్రిల్లర్ జానర్ చిత్రాలను నిర్మించడం కోసం ప్రత్యేకంగా ఏర్పడిన నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్.. వైనాట్ స్టూడియోస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. తాజాగా ఈ చిత్ర విడుదలకు సంబంధించి మేకర్స్ కీలక అప్‌డేట్‌ను ఇచ్చారు.
‘భ్రమయుగం’ కథ కేరళలో మాయ,తంత్రంతో నిండిన యుగంలో నడుస్తుంది. ఒక గాయకుడి జీవితంలో జరిగిన అనూహ్య ఘటనల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమా 2024, ఫిబ్రవరి 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మాతృక భాషలో చూస్తే ఆ అనుభూతి బాగుంటుండటంతో పాటు, మరింత థ్రిల్ చేస్తుందన్న ఉద్దేశంతో ముందుగా మలయాళం భాషలో మాత్రమే విడుదల చేయాలని తాజాగా మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మలయాళంలో విడుదలైన తర్వాత.. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో మరో మంచి తేదీ చూసుకుని విడుదల చేస్తామని మేకర్స్ తెలియజేశారు. (Bramayugam Telugu Release Postponed)
‘భ్రమయుగం’ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ కట్టిపడేసింది. ఫిబ్రవరి 10న అబు దాబిలో జరిగిన వేడుకలో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. చాలా కాలం తర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ కొత్త అనుభూతిని ఇస్తోంది. పాచికల ఆట నేపథ్యంలో, తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠను రేకెత్తిస్తూ సాగిన ట్రైలర్.. సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. థియేటర్లలో సీటు అంచున కూర్చొని ఈ సినిమా చూడటం ఖాయమనేది ట్రైలర్‌తో అర్థమైంది. మలయాళం మినహా.. ఇతర భాషలలో ఈ సినిమాను చూడాలని అనుకున్న వారికి మాత్రం.. మేకర్స్ తీసుకున్న నిర్ణయం కాస్త డిజప్పాయింట్ చేసేదే అని చెప్పుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
====================
*Kayal Anandhi: ఆనంది ‘వైట్ రోజ్’ ఫస్ట్ లుక్‌ని ఎవరు విడుదల చేశారంటే..
*************************
*Harish Shankar: దమ్ముంటే హరీష్ శంకర్ తెల్లవార్లు మద్యం తాగాడని రాయ్..
***************************
*Ooru Peru Bhairavakona: మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్.. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు
***************************
*Harish Shankar: ‘ఈగల్’లో లవ్ స్టోరీ లేదు.. ‘ఆర్ఆర్ఆర్’లో రొమాన్స్ లేదు
*************************