Jayaram: నిరాడంబరంగా జయరాం కుమార్తె వివాహం!
ABN, Publish Date - May 03 , 2024 | 04:53 PM
మలయాళ నటుడు జయరాం కుమార్తె మాళవిక జయరాం వివాహం సాదాసీదాగా జరిగింది. నవనీత్ గిరిశ్‌తో ఆమె ఏడడుగులు వేశారు. కేరళలోని గురువాయూర్‌లోని ఓ దేవాలయంలో వీరి వివాహం సంప్రదాయబద్థంగా జరిగింది.
మలయాళ నటుడు జయరాం (Jayaram) కుమార్తె మాళవిక జయరాం (malavika jayaram) వివాహం సాదాసీదాగా జరిగింది. నవనీత్ గిరిశ్‌తో (Navaneeth Girish) ఆమె ఏడడుగులు వేశారు. కేరళలోని గురువాయూర్‌లోని ఓ దేవాలయంలో వీరి వివాహం సంప్రదాయబద్థంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. పెళ్లి ఫొటోలు బయటకు రాగా నూతన వధూవరులకు నెటిజన్లు, అభిమానులని శుభాకాంక్షలు చెబుతున్నారు. Malavika Jayaram weds Navaneeth Girish)
మే 3న సినీ ప్రముఖుల కోసం భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. గిరీశ్ ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. జయరాం తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే! హీరోహీరోయిన్లకు తండ్రి పాత్రలు చేస్తూ అలరిస్తున్నారు. తాజాగా ‘గుంటూరు కారం’ సినిమాలో మహేశ్‌కు తండ్రిగా నటించారు. ప్రస్తుతం పలు తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్నారు.