Aparna Das: పెళ్లి విషయంలో కాస్త తొందరగానే ఉంది!
ABN, Publish Date - Apr 23 , 2024 | 12:59 PM
మరో యంగ్ హీరోయిన్ పెళ్లికి రెడీ అయింది. మలయాళ చిత్రం 'కథానాయికగా పరిచయమైన అపర్ణా దాస్ (Aparna das) పెళ్లి పీటలెక్కనుంది. 'దాదా’, విజయ్ ‘బీస్ట్’ (Beast) సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
మరో యంగ్ హీరోయిన్ పెళ్లికి రెడీ అయింది. మలయాళ చిత్రం 'కథానాయికగా పరిచయమైన అపర్ణా దాస్ (Aparna das) పెళ్లి పీటలెక్కనుంది. 'దాదా’, విజయ్ ‘బీస్ట్’ (Beast) సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు సడన్‌గా పెళ్లి వార్త చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఈమెని చేసుకోబోయేది కూడా నటుడే కావడం విశేషం. ఒమన్‌లో పుట్టి పెరిగిన అపర్ణ దాస్.. 2018లో ‘నాన్ ప్రకాషన్’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత మనోహరం, బీస్ట్, దాదా, ఆదికేశవ,(తెలుగు) సీక్రెట్ హోమ్ లాంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. (Malayalam actress)
ప్రస్తుతం మలయాళంలో 'ఆనంద్ శ్రీబాల' చిత్రంలో నటిస్తోంది. సాధారణంగా హీరోయిన్లు అంత తొందరగా పెళ్లి చేసుకోరు. కానీ అపర్ణ ఆ విషయం కాస్త ఫాస్ట్‌గానే ఉంది. ‘ముంజుమ్మల్ బాయ్స్’తోపాటు పలు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు దీపక్ పరంబోరల్‌తో ఆమె ఏడడుగులు వేయబోతోంది. ఏప్రిల్ 24న వివాహం జరగనుంది. తాజాగా హల్దీ వేడుక గ్రాండ్‌గా జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read More: Tollywood, Cinema News