Baiju Santhosh: క్ష‌మించండి.. టైరు పేలి యాక్సిడెంట్ అయింది! నేను తాగ‌లేదు

ABN, Publish Date - Oct 16 , 2024 | 05:36 PM

తన కారణంగా ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్ర‌ముఖ‌ మలయాళ నటుడు బైజు సంతోశ్ బుధవారం స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన క్షమాపణలు తెలిపారు.

santosh

తన కారణంగా ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్ర‌ముఖ‌ మలయాళ నటుడు బైజు సంతోశ్ (Baiju Santhosh) బుధవారం స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. నేనూ అందరిలాంటివాడినే. చట్టానికి కట్టుబడి ఉంటా. నాకేం ప్రత్యేక అధికారాలు లేవు. అయితే, నిజం తెలుసుకోకుండా పలు వెబ్సైట్లు తమకు తోచింది రాశాయి. దానిపై స్పష్టత ఇవ్వడానికే మీ ముందుకొచ్చాన‌న్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..టైరు పేలిపోవడం వల్ల కారుని అదుపు చేయలేకపోయాన‌ని. అందుకే ఆ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. ఆ సమయంలో నేను మద్యం సేవించి ఉన్నాననేది అవాస్తవం అని అన్నారు. అయితే.. ఆదివారం అర్ధరాత్రి తిరువనంతపురం రహదారిపై ప్రయాణిస్తున్న జైజు కారు. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టగా వాహనాదారుడికి స్వల్ప గాయాలయ్యాయి. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేశారనే అనుమానంతో పోలీసులు జైజును అరెస్ట్ చేశారు.

అనంతరం నటుడు బెయిల్ పై విడుదల అయ్యారు. దీంతో ఈ ఘ‌ట‌న కేర‌ళ నాట బాగ వైర‌ల్ అయింది. ఈ క్ర‌మంలో నటుడు బైజు సంతోశ్ తాజాగా ఓ వీడియో విడుద‌ల చేసి జ‌రిగింది చెప్పారు. లేనిపోని వార్త‌లు క‌ల్పించి కొత్త న్యూస్ ప్ర‌చారం చేయొద్ద‌ని కోరారు.

Updated Date - Oct 16 , 2024 | 05:37 PM