Remuneration: నటీనటులు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి
ABN, Publish Date - May 22 , 2024 | 10:03 AM
సినీ నటీనటులు తమ పారితోషికాన్ని తగ్గించుకోవాలని చిత్ర పంపిణీదారుల సంఘం విఙ్ఞప్తి చేసింది. ది మదురై, రామనాథపురం యునైటెడ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం తాజాగా జరిగింది. ఈ సంఘం 2024-26కుగానూ కొత్త కార్యవర్గం ఇటీవల ఎంపికైంది. సంఘం గౌరవాధ్యక్షుడిగా జీఎన్.అన్బుచెళియన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సినీ నటీనటులు తమ పారితోషికాన్ని తగ్గించుకోవాలని చిత్ర పంపిణీదారుల సంఘం విఙ్ఞప్తి చేసింది. ది మదురై, రామనాథపురం యునైటెడ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ (The Madurai Ramnad United Films Distributors Association) సర్వసభ్య సమావేశం తాజాగా జరిగింది. ఈ సంఘం 2024-26 సంవత్సరానికిగాను కొత్త కార్యవర్గం ఇటీవల ఎంపికైంది. సంఘం గౌరవాధ్యక్షుడిగా జీఎన్.అన్బుచెళియన్ (G N Anbu Chezhiyan)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అళగర్ స్వామి, కార్యదర్శిగా సాహుల్, ఉపాధ్యక్షుడిగా కేఆర్ ప్రభాకరన్, సహాయ కార్యదర్శిగా ఆర్.థామస్, కోశాధికారిగా ఆర్‌ఎం.మాణిక్యం, కార్యవర్గ సభ్యులుగా కె.వెంకటేశన్, జి.గుణశేఖరన్, సి.కాళీశ్వరన్, ఏఆర్‌ఎస్.మణి, ఆర్‌ఎం. వీరప్పన్, ఎస్.శరవణరాజా, ఎల్.శేఖర్, ఎస్‌పీ సెల్వ, ఆర్.రమేష్. వి.ఙ్ఞానదేశికన్ తదితరులు ఎంపికయ్యారు. ఇందులో కొన్ని తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు.
ప్రధానంగా నటీనటులు తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని కోరారు. అలాగే, కొత్త సినిమా విడుదలైన తర్వాత ఓటీటీలకు ఆరు వారాల తర్వాతే ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం థియేటర్లకు విధిస్తున్న 8 శాతం కాంపౌండింగ్ పన్ను పూర్తిగా రద్దు చేయాలని తీర్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలు అంశాలను వారు ఏకగ్రీవంగా ఆమోదించారు. మరీ ముఖ్యంగా రెమ్యూనరేషన్ (Remuneration) విషయాన్ని మాత్రం బాగా హైలెట్ చేశారు. మరి ఈ సంఘం ఆదేశాలను నటీనటులు ఎంత వరకు పాటిస్తారో చూడాలి మరి. ఎందుకంటే, ఆ మధ్య టాలీవుడ్ (Tollywood)లో కూడా ఇలాంటి హడావుడే జరిగింది. ఓ వారం, పది రోజుల పాటు షూటింగ్స్ కూడా బంద్ చేశారు. కానీ, ఆ తర్వాత అంతా నార్మలే అయింది. మరిప్పుడు కోలీవుడ్ (Kollywood)లో ఏం జరుగుతుందో చూడాలి.