Darshan: అభిమానిని ఇంత దారుణంగా చంపారా? కేసు విచారణలో సంచలన విషయాలు

ABN , Publish Date - Jun 26 , 2024 | 05:40 PM

దర్శన్ అభిమాని రేణుకస్వామి హత్య కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ విషయాలు తెలిసి ఒక్కొక్కరు షాక్ అవుతున్నారు. మరీ ఇంత దారుణమా? అంటూ దర్శన్‌ని అసహ్యించుకుంటున్నారు. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడ‌తోపాటు మొత్తం 14 మందిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే.

Darshan: అభిమానిని ఇంత దారుణంగా చంపారా? కేసు విచారణలో సంచలన విషయాలు
Kannada Actor Darshan

దర్శన్ (Darshan) అభిమాని రేణుకస్వామి (Renukaswamy) హత్య కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ విషయాలు తెలిసి ఒక్కొక్కరు షాక్ అవుతున్నారు. మరీ ఇంత దారుణమా? అంటూ దర్శన్‌ని అసహ్యించుకుంటున్నారు. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడ‌తోపాటు మొత్తం 14 మందిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దికాలంగా జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న దర్శన్, పవిత్ర, ఇతరులను విచారించగా వారు చేసిన అకృత్యాలు బయటపడ్డాయి. ఆ విషయాల్లోకి వెళితే..

Also Read-Kalki 2898AD Review: మహాభారత యుద్ధం తరువాత ఏమి జరిగిందో ఊహాత్మకంగా...

రేణుకస్వామి అదృశ్యంపై అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో కొందరిని అరెస్ట్ చేసి విచారించగా.. దర్శన్, పవిత్ర పేర్లు బయటకు వచ్చాయి. ఆ వ్యవహారంలో వారిని అరెస్ట్ చేసి విచారిస్తుండగా.. వారు రేణుకస్వామిని తీసుకొచ్చి ఎంత దారుణంగా హింసించారనే విషయం బయటకు వచ్చింది.‌ శాఖాహారం మాత్రమే తీసుకొనే రేణుకా స్వామి నోట్లో మాంసం ఎముక పెట్టి కొట్టారు. మాంసం తింటే నీకు దెబ్బలను ఓర్చుకొనే శక్తి వస్తుందని శారీరకంగా హింసించారు. చర్మం చిట్లిపోయి ఊడిపోయే విధంగా కొట్టారు. దాంతో అతడు మరణించాడు అనే విషయం విచారణలో వెలుగు చూసింది. తాజాగా రేణుకా స్వామి డెడ్ బాడీ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్ష మయ్యాయి. (Darshan Investigation)


Darshan.jpg

ఆ ఫోటోలను, అందులో రేణుకస్వామిని హింసించిన విధానాన్ని చూసిన నెటిజన్లు, పబ్లిక్.. ఇలాంటి దారుణమైన సంఘటనకు బాధ్యుడైన దర్శన్, పవిత్రగౌడ, ఇతరలను ఏ మాత్రం వదిలిపెట్టకూడదని, సభ్య సమాజం తలవంచుకొనేలా వ్యవహరించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. దర్శన్ అభిమాని రేణుకస్వామి భార్య ప్రస్తుతం గర్భిణీ కాగా.. భర్త మరణంతో ఆమె దిక్కుతోచని స్థితిలో ఉందని కన్నడ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Read Latest Cinema News

Updated Date - Jun 26 , 2024 | 07:02 PM