Darshan Case: దర్శన్‌తో పాటు 13 మంది అరెస్ట్‌.. పరారీలో మరో నలుగురు

ABN , Publish Date - Jun 13 , 2024 | 01:18 PM

అభిమాని హత్య కేసుకు సంబంధించి అరెస్ట్‌ అయిన కన్నడ హీరో దర్శన్ (Actor Darshan) తూగుదీప్ బుధవారం అక్కడిక్కడే తనిఖీ నిమిత్తం నేరం జరిగిన పట్టనగెరెకు తీసుకెళ్లినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

Darshan Case: దర్శన్‌తో పాటు 13 మంది అరెస్ట్‌.. పరారీలో మరో నలుగురు

అభిమాని హత్య కేసుకు సంబంధించి అరెస్ట్‌ అయిన కన్నడ హీరో దర్శన్ (Actor Darshan) తూగుదీప్ బుధవారం అక్కడిక్కడే తనిఖీ నిమిత్తం నేరం జరిగిన పట్టనగెరెకు తీసుకెళ్లినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న దర్శన్‌ సన్నిహితురాలు పవిత్ర గౌడను (pavitra gowda) కూడా ఘటనా స్థలానికి తీసుకొచ్చారు. నిఖిల్‌, వినయ్‌, కార్తీక్‌, రాఘవేంద్ర సహా దర్శన్‌ సహచరులను కూడా ముందుగా అక్కడికి తీసుకెళ్లి తనిఖీ చేశారు. మృతదేహాన్ని పారవేయడంపై  వారిపై ఆరోపణలున్నాయి. రేణుకాస్వామి హత్య (Renuka Swami Murder) కేసులో దర్శన్‌, పవిత్ర గౌడ సహా 13 మందిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మరోవైపు ఈ కేసులో ఓ మహిళ సహా మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. చిత్రదుర్గకు చెందిన దర్శన్‌ అభిమాని రేణుకాస్వామి.. తన ఫేవరెట్‌ హీరో దర్శన్‌కు, అతని భార్య విజయలక్ష్మికి మధ్య పవిత్ర గౌడ వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ సోషల్‌ మీడియా ఖాతాలో వ్యాఖ్యానించాడు. అతను అసభ్య పదజాలం ఉపయోగించాడని మరియు అభ్యంతరకరమైన సందేశాలను పోస్ట్‌ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పవిత్రను వేధించినందుకు రేణుకాస్వామిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక  దర్శన్‌,  పవిత్రపై కూడా దాడి చేశాడని రేణుకాస్వామి హత్య తర్వాత పవిత్రపై దర్శన్‌ దాడి చేసినట్లు సమాచారం. నీ వల్లే ఇదంతా జరిగింది అని దర్శన్‌ ఆమె పై ఎటాక్‌ చేశాడట. దాడికి గురైన పవిత్ర బెంగళూరులోని ఆర్‌ఆర్‌ ఆస్పత్రిలో చికిత్స పొంది సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయినట్లు తెలుస్తోంది.

WhatsApp Image 2024-06-13 at 12.10.06 PM.jpeg

ఇక పవిత్ర గౌడ విషయానికి వస్తే.. కన్నడ సినీ పరిశ్రమలో నటిగా  ఫ్యాషన్‌ డిజైనర్‌, దక్షిణాది సినిమా పరిశ్రమలో నటిగా రాణిస్తున్నారు. 2016 సంవత్సరంలో 54321 అనే చిత్రంలో నటించడం ద్వారా కన్నడ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత 'చత్రిగాలు సార్‌ చత్రిగాలు’, 'ఆగమ్య’, 'సాగువ దారియాలి’ అనే చిత్రాల్లో నటించారు. నటిగానే కాకుండా ఫ్యాషన్‌ డిజైనర్‌గా కూడా వ్యవహరిస్తుంది. బెంగళూరులో రెడ్‌ కార్పెట్‌ సూడియో పేరుతో  ఫ్యాషన డిజైనర్‌ స్టూడియోను నిర్వహిస్తుంది. కన్నడ సినిమా పరిశ్రమలో ఆమె డిజైనింగ్‌కు మంచి పాపులారిటీ ఉంది. గత దశాబ్ద కాలంగా పవిత్ర గౌడకు హీరో దర్శన్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆమెకు ఓ కూతురు కూడా ఉంది. భర్తతో వివాదాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే దర్శన్‌తో కూడా సన్నిహిత సంబంధం ఉండటం  వివాదంగా మారింది. పవిత్ర కూతురు ఖుషీ పుట్టిన రోజు వేడుకలో దర్శన్‌ పాల్గొనడం ద్వారా వారికి ఉన్న సంబంధం బయటకు వచ్చింది.

WhatsApp Image 2024-06-13 at 12.07.52 PM.jpeg

Updated Date - Jun 13 , 2024 | 02:39 PM