Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్‌ 1’కి బ్రేక్.. ఘోర ప్రమాదం

ABN, Publish Date - Nov 25 , 2024 | 08:21 PM

‘కాంతార చాప్టర్‌ 1’ సినిమా షూటింగ్ ఆగిపోయినట్లు వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఒక అవాంఛనీయ సంఘటన ఈ వార్తలకి మూల కారణం. నిజంగానే సినిమా ఆగిపోయిందా? మేకర్స్ ఏమన్నారంటే..

కన్నడ నటుడు రిషబ్‌శెట్టి (Rishab Shetty) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాంతార చాప్టర్‌ 1’ (Kantara Chapter 1). 2022లో చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో చక్కని విజయం అందుకొంది.రూ.16 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకోగా రూ.450 కోట్లు వసూలు చేసిందని అంచనా. ఈ చిత్రానికి గాను ఆయన ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్‌ 1’ రానుండడంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఒక అవాంఛనీయ సంఘటన కారణంగా షూటింగ్ నిలిపివేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఏమైందంటే..


తాజాగా ఈ సినిమా షూటింగ్ నిలిపివేస్తున్నట్లు వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆదివారం రాత్రి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని తిరిగి వస్తున్న బస్ బోల్తా పడింది. ఈ బస్సులో 20 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. కాగా, ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. హంబోలే సంస్ద నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2 న పాన్ ఇండియా వైడ్ విడుదల కావాల్సి ఉంది. అయితే ఇది కేవలం మైనర్ ఆక్సిడెంట్ అని సినిమా షూటింగ్ నిలిపివేయడం లేదని మేకర్స్ ప్రకటించారు.


ఈ సినిమాలో జయరామ్‌, జిషుసేన్‌ గుప్తా కీలక పాత్రధారులు. అజనీష్‌ లోకనాథ్‌ సంగీతం అందిస్తున్నారు. పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌గా ఇది సిద్ధమవుతోంది. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరంగదూర్‌ దీనిని నిర్మిస్తున్నారు. జయరామ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. కదంబుల కాలంలో సాగే ఆసక్తికర కథాంశంతో ఇది ఉండనుంది. దీనికోసం రిషబ్‌ కలరిపయట్టు యుద్ధ విద్యలో గత కొన్నాళ్లుగా కఠిన శిక్షణ తీసుకుంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎన్టీఆర్‌ కూడా స్పందించారు. రిషభ్ ప్లాన్‌ చేస్తే తాను తప్పకుండా యాక్ట్‌ చేస్తానని అన్నారు.

Updated Date - Nov 25 , 2024 | 08:21 PM