JAWA: తమిళంలోకి.. హీరోగా ఎంట్రీ ఇస్తున్న కన్నడ స్టార్
ABN, Publish Date - Jul 16 , 2024 | 09:23 PM
కన్నడ అగ్ర హీరో శివరాజ్ కుమార్ తమిళంలోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ నిర్మాత టీజీ త్యాగరాజన్ సమర్పణలో తెరకెక్కే ఈ చిత్రానికి రవి అరసు దర్శకుడు.
కన్నడ అగ్ర హీరో శివరాజ్ కుమార్ (Dr Shiva Rajkumar) తమిళంలోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ నిర్మాత టీజీ త్యాగరాజన్ సమర్పణలో తెరకెక్కే ఈ చిత్రానికి రవి అరసు (Raviarasu) దర్శకుడు. ఈ సినిమాకు ‘జావా’ (JAWA) అనే టైటిల్ ఖరారు చేశారు.
కొందరు హీరోలకు ప్రాంతీయ హద్దులు దాటి అభిమానులుంటారు. అలాంటి వారిలో శివరాజ్ కుమార్ ఒకరు. శాండల్‌వుడ్‌లో భారీగా అభిమానులనున్న శివరాజ్ కుమార్ (Dr Shiva Rajkumar)... తమిళ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆయన నటించే కన్నడ చిత్రాలకు తమిళనాట కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఇటీవల సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’లో ఓ కీలక పాత్ర పోషించారు.
ఈ నేపథ్యంలో ‘జావా’ పేరుతో తెరకెక్కే తమిళ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సీనియర్ నిర్మాత టీజీ త్యాగరాజన్ సమర్పణలో సత్యజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ..‘ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్న శివరాజ్ కుమార్ (Dr Shiva Rajkumar) వంటి స్టార్ హీరో చిత్రానికి దర్శకత్వం చేయనుండటం గర్వంగా ఉందన్నారు.
సెప్టెంబరులో సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నామని ఇందులో జావా బైక్‌కు ఓ ఇంపార్టెంట్ రోల్ ఉందని అన్నారు. ఇంతకుమించి స్టోరీ ఇప్పుడు వెల్లడించలేమన్నారు. శివరాజ్ కుమార్ (Dr Shiva Rajkumar) పోలీస్ పాత్రలో, సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారని వివరించారు.