kiccha sudeep: సుదీప్ ఇంట తీవ్ర విషాదం

ABN, Publish Date - Oct 20 , 2024 | 12:44 PM

ఈగ సినిమా ఫేమ్  కిచ్చా సుదీప్‌ (Kichcha Sudeep) ఇంట  విషాదం చోటు చేసుకుంది.

ఈగ సినిమా ఫేమ్  కిచ్చా సుదీప్‌ (Kichcha Sudeep) ఇంట  విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి సరోజా సంజీవ్ (Saroja Sanjeev-86) ఆదివారం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో కొన్ని రోజులుగా బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

ఆమె మరణ వార్త  తెలుసుకున్న పలువురు ప్రముఖులు సుదీప్‌ను పరామర్శించారు. ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అభిమానులు సోషల్ మీడియా వేదిక నివాళులు అర్పిస్తున్నారు 

Prabhas: టోక్యోలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కోలాహలం


Updated Date - Oct 20 , 2024 | 12:44 PM