Charuhasan: ఆస్పత్రిలో చేరిన కమల్ హాసన్ సోదరుడు
ABN, Publish Date - Aug 02 , 2024 | 08:31 AM
విశ్వనటుడు కమల్ హాసన్ సోదరుడు, సీనియర్ సినీ నటుడు చారుహాసన్ అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె, సినీ నటి సుహాసిని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించారు.
విశ్వనటుడు కమల్ హాసన్ (Kamalhasan) సోదరుడు, సీనియర్ సినీ నటుడు చారుహాసన్ (Charuhasan) అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారు. 93 యేళ్ళ చారుహాసన్ ఆస్పత్రిలో చేరిన విషయాన్ని ఆయన కుమార్తె, సినీ నటి సుహాసిని ( Suhasini) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆస్పత్రి బెడ్‌పై ఉన్న తన తండ్రిని హత్తుకున్న ఫొటోను కూడా ఆమె షేర్ చేశారు. ‘వైద్యులు, నర్సులు, ప్రజల ప్రేమాభిమానాలు, సంరక్షణతో ఆయన కోలుకుంటున్నారు’ అని కామెం ట్స్ చేశారు. అయితే, ఆయన అనారోగ్యానికి సంబంధించిన విషయాలు మాత్రం ఆమె వెల్లడించలేదు.
కాగా, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ సహా అనేక భాషా చిత్రాల్లో నటించిన చారుహాసన్.. చివరగా, విజయ్‌శ్రీ జీ దర్శకత్వంలో వచ్చిన ‘హరా’ మూవీలో నటించారు. తెలుగులో 2023లో అవికాఘోర్ నటించిన పాప్‌కార్న్ చిత్రంలో నటించారు. ఇదిలాఉండగా కమల్ హసన్ మరో సోదరుడు చంద్ర హసన్ గుండోపోటుతో 2017లో మరణించారు.