Kamal Haasan: ఈ రెండు సినిమాలు చేయకపోవడానికి కారణం!

ABN, Publish Date - Jun 30 , 2024 | 04:41 PM

రజనీకాంత్‌ హీరోగా దర్శకుడు శంకర్‌ తెరకెక్కించిన సంచలనాత్మక చిత్రాల్లో ‘2. ఓ’ ఒకటి. ఈ చిత్రంలో విలన్ గా  మొదట కమల్‌ హాసన్‌ను అనుకున్నారట దర్శకుడు. కానీ కమల్‌ ఆ చిత్రంలో నటించేందుకు తిరస్కరించారు.

రజనీకాంత్‌ (Rajanikanth) హీరోగా దర్శకుడు శంకర్‌ (Shankar) తెరకెక్కించిన సంచలనాత్మక చిత్రాల్లో ‘2. ఓ’ (2.O)ఒకటి. ఈ చిత్రంలో విలన్ గా  మొదట కమల్‌ హాసన్‌ను Kamal haasan) అనుకున్నారట దర్శకుడు. కానీ కమల్‌ ఆ చిత్రంలో నటించేందుకు తిరస్కరించారు. దానికి గల కారణాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ రోల్‌ కోసం శంకర్‌ తనను సంప్రదించగా.. ఇంకా కొన్నాళ్లపాటు హీరోగా ఉండాలనుకుంటున్నానని నవ్వుతూ సమాధానమిచ్చినట్లు చెప్పారు. మరోవైపు, తాను కథానాయకుడిగా ‘రోబో’ ఎందుకు తెరకెక్కలేదో కూడా తెలిపారు విశ్వ నాయకుడు. ‘‘ఐ-రోబో’ అనే ఇంగ్లీష్‌ నవలను తెరకెక్కిస్తే బాగుంటుందని నేను, శంకర్‌, రచయిత సుజాత 90ల్లోనే అనుకున్నాం. హీరో పాత్రకు సంబంధించి లుక్‌ టెస్ట్‌ కూడా పూర్తయింది. కానీ, ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కలేదు. చిత్ర పరిశ్రమలో రెమ్యూనరేషన్‌, డేట్స్‌.. ఇలా చాలా లెక్కలుంటాయి. అప్పటి మార్కెట్‌నూ దృష్టిలో పెట్టుకుని ఆ సినిమా చేయకపోవడమే మంచిదనిపించింది. అందుకే నేను వెనకడుగేశా. నా స్నేహితుడు శంకర్‌ మాత్రం దాన్ని వదల్లేదు. సరైన సమయంలో ‘రోబో’ను రూపొందించి సూపర్‌హిట్‌ అందుకున్నాడు’’ అని కమల్‌ చెప్పుకొచ్చారు.

కమల్‌ నో చెప్పడంతో రజనీకాంత్‌ హీరోగా ‘రోబో’ను శంకర్‌ తెరకెక్కించారు. ‘2.ఓ’లో ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ని ఎంపిక చేశారు. కమల్‌- శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందిన లేటెస్ట్‌ మూవీ భారతీయుడు 2’. 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడుకి సీక్వెల్‌గా రూపొందింది. రకుల్‌ ప్రీత సింగ్‌. సిద్థార్థ్‌, ప్రియా భవానీ శంకర్‌ తదితరలు కీలక పాత్రలు పోషించారు. జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. 

Updated Date - Jun 30 , 2024 | 04:41 PM