Drishyam debate: దృశ్యం రచ్చపై అసలు దర్శకుడు ఫైర్!
ABN, Publish Date - Mar 04 , 2024 | 08:45 PM
మోహన్‌లాల్ కీలక పాత్రలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం’. 2013లో మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే! ఇప్పుడు హాలీవుడ్, కొరియన్ భాషల్లో రీమేక్ అయ్యేందుకు సిద్థమైంది.
మోహన్‌లాల్ (Mohanlal) కీలక పాత్రలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం’ (Drishyam). 2013లో మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే! యూనివర్సెల్ కాన్సెప్ట్ కావడంతో ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్ అయి సక్సెస్ సాధించింది. అంతేకాదు సింహళ, చైనీస్‌లోనూ రీమేక్ చేశారు. ఇప్పుడు హాలీవుడ్, కొరియన్ భాషల్లో రీమేక్ అయ్యేందుకు సిద్థమైంది. ఇటీవలే దీనికి సంబంధించిన ప్రకటన వచ్చింది. ఈ సందర్భంగా ‘దృశ్యం’ మాతృకను తీసిన దర్శకుడు జీతూ జోసెఫ్ ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబం, ప్రేమ, భద్రత వంటి యూనివర్సల్ అంశాలే కథా వస్తువుగా సినిమా తీశాం. అది అందరికీ కనెక్ట్ అయంది. కథలో ఉండే సహజమైన భావోద్వేగాలకు ఎలాంటి ప్రేక్షకుడు అయినా కనెక్ట్ అవుతారు" అని అన్నారు. (Drishyam Debate)
తాజాగా హాలీవుడ్‌లో రీమేక్ కానుండటంతో 'మా హీరో సినిమా అంటే.. మా హీరో సినిమా’ అని సోషల్ మీడియాలో రచ్చలేపుతున్నారు అభిమానులు. మోహన్‌లాల్ మూవీ అంటూ కొందరు.. లేదు ఇది అజయ్ దేవగణ్ ‘దృశ్యం’ అంటూ ఇంకొందరు చర్చకు లేవనెత్తారు. ఆంగ్ల వెబ్‌సైట్స్ అజయ్ దేవ్‌గణ్ నటించిన ‘దృశ్యం’ అంటూ రాయడంతో సోషల్‌మీడియా వేదికగా చర్చ మొదలైంది. దీనిపై జీతూ జోసెఫ్ మండిపడ్డారు. ఇవి అర్థం లేని వాదనలు అంటూ కొట్టిపారేశారు. అంతేకాదు, ఒక ప్రొడక్షన్ హౌస్‌కు రీమేక్ రైట్స్ అమ్మేశారని వస్తున్న వార్తలనూ ఆయన ఖండించారు. పలు హిందీ చిత్రాలు మలయాళంతో పాటు ఇతర భాషల్లో రీమేక్ చేసిన సందర్భాలున్నాయి. మాతృకతో పోలిస్తే అవి మరింత పేరు సంపాదించాయి’. ‘దృశ్యం’ చూసిన ప్రతి ఒక్కరికీ అది మొదట మలయాళంలో తీసిన సినిమా అని తెలుస్తుంది’’ అని అన్నారు.
ఇటీవల జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్‌లాల్, ప్రియమణి కీలక పాత్రలు పోషించిన ‘నెరు’ విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు మోహన్‌లాల్‌తో కలిసి ‘రామ్’ అనే సినిమాను జోసెఫ్ రూపొందిస్తున్నారు. రెండు పార్టులుగా రానున్న ఈ మూవీలో త్రిష, ఇంద్రజిత్ సుకుమారన్, సాయికుమార్, సిద్థిఖీ నటిస్తున్నారు.