Siren: తెలుగులో వస్తున్న.. జయం రవి అదిరిపోయే లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్
ABN, Publish Date - Feb 12 , 2024 | 03:27 PM
'తని ఒరువన్' 'కొమాలి' 'పొన్నియిన్ సెల్వన్' లాంటి చిత్రాలతో తెలుగులో మంచి ఆదరణ పొందిన హీరో జయం రవి తాజాగా సైరన్ అనే మాస్ ఎంటర్టైనర్ చిత్రంతో రానున్నాడు.
'తని ఒరువన్' 'కొమాలి' 'పొన్నియిన్ సెల్వన్' లాంటి చిత్రాలతో తెలుగులో మంచి ఆదరణ పొందిన హీరో జయం రవి (Jayam Ravi) తాజాగా 'సైరన్ (Siren) అనే మాస్ ఎంటర్టైనర్ చిత్రంతో రానున్నారు. అంథోని భాగ్యరాజ్ (Antony Bhagyaraj) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో 'గంగ ఎంటర్టైన్మెంట్స్ (Ganga Entertainments) పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి (Maheswara Reddy Mooli) ఫిబ్రవరి 23న విడుదల చేయనున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) , అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్లుగా కనిపించనున్న ఈ చిత్ర తెలుగు టీజర్ ఇటీవల విడుదలై మంచి స్పందన లభించింది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుజాత విజయకుమార్ మాట్లాడుతూ.. 'సైరన్ (Siren) చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఫ్యామిలీ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ కుదిరేలా తెరకెక్కించాం. జయం రవి గారు మునుపెన్నడూ కనిపించని లుక్ మరియు పాత్రలో కనిపించనున్నారు. కీర్తి, అనుపమ మొదటి సారి ఆయనతో కలిసి నటించారు. ఫిబ్రవరి 23న తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో ఈ చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నామన్నారు. నటుడు సముద్రఖని మాట్లాడుతూ జయం రవి (Jayam Ravi) చాలా ప్రతిభ గల నటుడు. ఇంకో వంద చిత్రాలైన చెయ్యగల నేర్పు అతనిలో ఉంది. మేము ఇదివరకే కలిసి నటించాం. ఈ చిత్రంలో మా పాత్రలు అద్భుతంగా వచ్చాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చే చిత్రమిదని అన్నారు.
సంగీత దర్శకుడు జివి ప్రకాష్ మాట్లాడుతూ.. జయం రవి (Jayam Ravi) గారు ఈ చిత్రంలో చాలా పరిపక్వతతో నటించారు. ఈ చిత్రంలోని పాటలు నాకు చాలా స్పెషల్. నాకు ఈ సంవత్సరం ఈ చిత్రంతో ప్రారంభమవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు ఆంథోని భాగ్యరాజ్ (Antony Bhagyaraj) మాట్లాడుతూ.. ఈ చిత్రం నాకొక కలలా జరిగిపోయింది. ఒక కొత్త దర్శకుడి మొదటి చిత్రం, అదీ పెద్ద హీరో తో అయినప్పుడు, కచ్చితంగా హిట్ అవ్వాలనుకుంటారు. ఆ బాధ్యత జయం రవి (Jayam Ravi) తీసుకున్నారు. జివి గారి మెలోడీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ చిత్రానికి ఆయన దాదాపు 20 ట్యూన్లు ఇచ్చి ఎప్పటికప్పుడు నాలో స్ఫూర్తి నింపుతూనే ఉన్నారు. చిత్రం అద్భుతంగా వచ్చింది. తెలుగు ప్రేక్షకులకి నచ్చుతుందని ఆశిస్తున్నామన్నారు.
హీరో జయం రవి (Jayam Ravi) మాట్లాడుతూ..ఈ చిత్రంలో ఎమోషన్స్ చాలా ముఖ్య పాత్రలు వహిస్తాయి. వాటికి జి.వి తన సంగీతంతో ప్రాణం పోసాడు. ఇండియాలో ఉన్న మేటి సంగీత దర్శకుల్లో జి.వి.ప్రకాష్ అగ్ర స్థానంలో ఉంటాడు. అలాగే ఈ చిత్రంలో ముఖ్యమైన లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రకి కీర్తి బాగుంటుందనుకున్నాము, మా నమ్మకాన్ని తను పూర్తిగా నిలబెట్టింది. ఆంథోనీ భాగ్యరాజ్ రానున్న కాలంలో చాలా ఎత్తుకు ఎదగడం ఖాయం. కొత్త దర్శకులతోనే చేస్తున్నందుకు నన్ను చాలా మంది మందలిస్తుంటారు కానీ ప్రతిభ గల దర్శకుడి కష్టంలోనే చిత్ర విజయం కనిపిస్తుంది నాకు. ఈ చిత్రంలో నేను రెండు విభిన్నమైన పాత్రలు పోషించాను. మా 'సైరన్ (Siren) తమిళ - తెలుగు ప్రేక్షకులని ఆద్యంతం ఆకట్టుకుంటుందనే నమ్మకం పూర్తిగా ఉంది" అన్నారు.