Red Flower: ‘రెడ్ ఫ్లవర్’సినిమా కోసం.. హంగేరియన్ ఆర్కెస్ట్రా
ABN, Publish Date - Sep 15 , 2024 | 11:53 AM
‘రెడ్‌ఫ్లవర్’ చిత్రం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కంపోజింగ్ కోసం హంగేరియన్ ఆర్కెస్ట్రా పనిచేస్తుందని సంగీత దర్శకుడు. సంతోష్ రామ్ అన్నారు. ఆయన సంగీత అందిస్తున్న‘రెడ్‌ఫ్లవర్’ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ ఇప్పటికే పూర్తి చేసుకోగా విడుదలకు రెడీ అవుతోంది.
నటుడు విఘ్నేష్ (Vignesh) హీరోగా ఆండ్రూ పాండియన్ (Andrew Pandian) దర్శకత్వంలో శ్రీ కాళికాంబాల్ పిక్చర్స్ (SriKaligambalPictures ) సమర్పణలో నిర్మాత కె.మాణిక్యం నిర్మిస్తున్న ‘రెడ్‌ఫ్లవర్’ (Red Flower) చిత్రం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కంపోజింగ్ కోసం హంగేరియన్ ఆర్కెస్ట్రా పనిచేస్తుంది. సంతోష్ రామ్ (Santhosh Ram) సంగీతం అందిస్తున్నారు. అయితే, నేపథ్య సంగీతం బలంగా ఉండాలని భావించిన దర్శక నిర్మాతలు ఇందుకోసం హంగేరియన్ ఆర్కెస్ట్రా సాయం తీసుకున్నారు.
వైవిధ్యభరితమైన యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తి చేసుకోగా, నేపథ్య సంగీతం, వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. ఈ విషయంపై సంగీత దర్శకుడు సంతోష్ రామ్ (Santhosh Ram) మాట్లాడుతూ, ‘ఇది నేను చేసే తొలి ప్రాజెక్టు. నా ప్రతిభను నిరూపించుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాను. ‘రెడ్‌ఫ్లవర్’ (Red Flower)అనేది ఫ్యూచరిస్టిక్ మూవీ. అందుకే సైన్స్ ఫిక్షన్‌కి సరిపోయే ఆధునిక, వినూత్నమైన ఆర్కెస్ట్రా స్కోర్ అందించేందుకు హంగేరియన్ సంగీత బృందంతో కలిసి పనిచేస్తున్నాను’ అని తెలిపారు.