'హిట్ లిస్ట్' ట్రైలర్ విడుదల
ABN, Publish Date - May 26 , 2024 | 05:17 PM
తమిళ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క (Vijay Kanishka) హీరోగా సముద్రఖని, శరత్ కుమార్ (Sarath Kumar) గౌతమ్ వాసుదేవ మీనన్ (goutham menon) ముఖ్యపాత్రలో నటించిన సినిమా 'హిట్ లిస్ట్' (Hit list).
తమిళ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క (Vijay Kanishka) హీరోగా సముద్రఖని, శరత్ కుమార్ (Sarath Kumar) గౌతమ్ వాసుదేవ మీనన్ (goutham menon) ముఖ్యపాత్రలో నటించిన సినిమా 'హిట్ లిస్ట్' (Hit list). సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకత్వంలో ఆర్. కె. సెల్యులాయిడ్స్ పై డైరెక్టర్ కె. ఎస్. రవికుమార్ గారు నిర్మిస్తున్న సినిమా.తాజాగా ఈ చిత్రం టీజర్ ను వెర్సటైల్ హీరో సూర్య విడుదల చేశారు. యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ జోనర్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది.
ముఖ్య అతిధి మురళీమోహన్ మాట్లాడుతూ.. హీరో విజయ్ కనిష్క నాన్నగారు విక్రమన్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉండి మొదటి సినిమా అయినా చాలా అద్భుతంగా నటించాడు. నాకు బాగా సన్నిహితుడు కె. ఎస్. రవికుమార్ గారు ఈ సినిమాకి నిర్మాతక వ్యవహరించడం మంచి విషయం. ట్రైలర్ చాలా బాగుంది సినిమా ఖచ్చితంగా మన సక్సెస్ అవ్వాలని అవుతుందని కోరుకుంటున్నాను" అన్నారు.
నిర్మాత కె. ఎస్. రవికుమార్ గారు మాట్లాడుతూ : నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో టెన్ ఇయర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తాను. 1990లో 'కుదు వసంతం' సినిమాతో విక్రమన్ సార్ కి నాకు మంచి పరిచయం ఏర్పడింది. ఇప్పుడు విజయ్ కనిష్క ని నేను లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నేను తెలుగు తమిళ్ లో ఎంతోమంది పెద్ద హీరోలతో పని చేశాను. మే 31న ఈ సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. కచ్చితంగా అందరికీ ఈ సినిమా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.
హీరో విజయ్ కనిష్క గా మాట్లాడుతూ "హిట్ లిస్ట్ మూవీ కథ నాకు బాగా నచ్చింది. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న శ్రీనివాస్ గౌడ్ గారికి బిక్కం రవీంద్ర గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా దర్శకులు సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ నాకు చాలా కంఫర్ట్ ఇచ్చి ఈ సినిమా చేయించారు. మా నాన్నగారు తమిళ్, తెలుగులో పెద్ద సినిమాలు తీసిన డైరెక్టర్ విక్రమన్ గారు. తెలుగులో మా నాన్నగారు మొదటగా తీసిన సినిమా వసంతం వెంకటేష్ గారితో మొదటి సినిమా అయిన ఆయనకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. నాకు కూడా ఈ సినిమాకి అదే సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.
తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాతలు శ్రీనివాస్ గౌడ్, బెక్కం రవీంద్ర మాట్లాడుతూ " మా మీద నమ్మకంతో తెలుగు విడుదల హక్కుల్ని ఇచ్చిన కె. ఎస్. రవికుమార్ గారికి ధన్యవాదాలు. మే 31న వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు ఈ సినిమాని మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.