Game Changer: గేమ్ ఛేంజర్ నెక్ట్స్ సాంగ్ బడ్జెట్ ఎంత అంటే.. నాలుగు చిన్న సినిమాలు చేసేయొచ్చు

ABN, Publish Date - Oct 18 , 2024 | 12:49 PM

ఇప్పటీకే ఫిల్మ్ మేకర్స్ 'జరగండి జరగండి', 'రా మ‌చ్చా మ‌చ్చా' సాంగ్స్ రిలీజ్ చేసి అభిమానుల్లో హైప్ పెంచారు. నెక్ట్స్ ఓ మెలోడీ సాంగ్‌ని రిలీజ్ చేయబోతున్నారు. గ్రాండ్ విజువల్స్‌తో చిత్రీకరించిన ఈ పాటను నిర్మించటానికి నాలుగు చిన్న సినిమాలను నిర్మించే బడ్జెట్‌లో చేశారట. దీంతో అందరు నోటిపై వేలేసిన.. డైరెక్టర్ శంకర్‌కి ఇది మామూలు విషయం. ఇంతకీ ఆ సాంగ్ బడ్జెట్ ఎంత.. రిలీజ్ ఎప్పుడంటే..

Ram Charan In Game Changer

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’(Game Changer). శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌. 2025లో సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళ‌, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధ‌మ‌వుతోన్న ఈ సినిమాపై ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అంచ‌నాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటీకే ఫిల్మ్ మేకర్స్ 'జరగండి జరగండి', 'రా మ‌చ్చా మ‌చ్చా' సాంగ్స్ రిలీజ్ చేసి అభిమానుల్లో హైప్ పెంచారు. నెక్ట్స్ ఓ మెలోడీ సాంగ్‌ని రిలీజ్ చేయబోతున్నారు. గ్రాండ్ విజువల్స్‌తో చిత్రీకరించిన ఈ పాటను నిర్మించటానికి నాలుగు చిన్న సినిమాలను నిర్మించే బడ్జెట్‌లో చేశారట. దీంతో అందరు నోటిపై వేలేసిన.. డైరెక్టర్ శంకర్‌కి ఇది మామూలు విషయం. ఇంతకీ ఆ సాంగ్ బడ్జెట్ ఎంత.. రిలీజ్ ఎప్పుడంటే..


దాదాపు రూ. 450 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ కోసం రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి పోటీ నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన 'జరగండి జరగండి' సాంగ్ యూట్యూబ్‌లో 45 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టి హిట్‌గా నిలిచింది. ఇటీవల రిలీజ్ చేసిన 'రా మ‌చ్చా మ‌చ్చా' లిరికల్ సాంగ్ కూడా 35 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ లో రచ్చ రేపింది. అయితే నవంబర్‌లో ఈ సినిమాకి సంబంధించిన నెక్స్ట్ సాంగ్ ఒక లిరికల్ మెలోడీని విడుదల చేస్తామని మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే గ్రాండ్ విజువల్స్‌తో షూట్ చేసిన ఈ పాటకి అక్షరాలా రూ. 20 కోట్లు ఖర్చయిందట. దీంతో టాలీవుడ్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్న కోలీవుడ్ ఫ్యాన్స్ మాత్రం శంకర్ సినిమా అంటే ఇదంతా సర్వసాధారణం అంటున్నారు. మరి 20 కోట్లు ఏంటి.. దీంతో నాలుగు చిన్న సినిమాలు నిర్మించొచ్చు, పాపం దిల్ రాజు అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఏదిఏమైనా తమన్ అన్న మ్యూజిక్ ఇరగదీసి.. సినిమా బ్లాక్ బస్టర్ అయితే చాలు అంటున్నారు మెగా అభిమానులు.

Also Read- Music Directors: టాలీవుడ్‌లో తమిళ కంపోజర్‌ల హవా..


‘రా మ‌చ్చా మ‌చ్చా..’ సాంగ్ విషయానికి వస్తే.. రామ్ చ‌ర‌ణ్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌గా రూపుదిద్దుకున్న ఈ సాంగ్‌ను భార‌తీయ‌ సినీమా చ‌రిత్ర‌లో నెవ్వ‌ర్ బిఫోర్ అనేలా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ త‌న మార్క్‌ను చూపిస్తూ తెరకెక్కించారు. ఎన‌ర్జిటిక్‌, స్టైలిష్ లుక్‌లో రామ్ చ‌ర‌ణ్ ఆక‌ట్టుకుంటున్నారు. ఇక గ్రేస్‌తో ఆయ‌న వేసిన హుక్ స్టెప్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉంది. ఈ స్టెప్ నెట్టింట ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతుంద‌న‌టంలో సందేహం లేదు. ఇందులో ఏకంగా 1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులు ఈ పాట‌లో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి డాన్స్ చేయటం విశేషం. అది కూడా భిన్న‌త్వానికి ఏక‌త్వమైన మ‌న దేశంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒరిస్సా, క‌ర్ణాట‌క‌, వెస్ట్ బెంగాల్‌, జార్ఖండ్ రాష్ట్రాల‌కు చెందిన జాన‌ప‌ద క‌ళాకారులు.. ఇందులో భాగం అయ్యారు.

Also Read- Salman Khan: సల్మాన్ ఇంటి దగ్గర ఫైర్.. బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ అరెస్ట్

Also Read- Ram Charan: నిండైన మనసుతో పాపకు ప్రాణం పోశాడు


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 18 , 2024 | 12:50 PM