నరనరాల్లో రక్తాన్ని పరుగులు పెట్టించేలా ‘రా రా రత్నం’ పాట
ABN, Publish Date - Jan 01 , 2024 | 05:37 PM
మాస్ యాక్షన్ హీరో విశాల్ తాజాగా మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ రోజు ఈ చిత్రం నుంచి ఓ పాటను విడుదల చేశారు. రా రా రత్నం అంటూ సాగే ఈ పాట రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది.
మాస్ యాక్షన్ హీరో విశాల్ (Vishal) తాజాగా మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గత వినాయక చవితికి మార్క్ అంటోని సినిమాతో తమిళనాట100 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన ఆయన ఈ సారి సూర్యాతో వరుసబెట్టి సింగం సినిమాలు తీసిన హరి ( Hari) దర్శకత్వంలో ‘రత్నం’ (Rathnam) అనే సినిమాలో నటిస్తున్నాడు. సముద్రఖని, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో నటించారు.
జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా రూపొందిస్తోండగా కార్మికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ కో-ప్రోడ్యుసర్. విశాల్ (Vishal) కు జోడీగా ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ షాట్ టీజర్‌ను విడుదల చేయగా అందరినీ ఆకట్టుకుంది. విశాల్ ఇది వరకు ఎన్నడూ చూడని లుక్కులో, మాస్ అవతారంలో కనిపించాడు. తల నరికి చేత్తో పట్టుకునే ఆ సీన్ అందరికీ గూస్ బంప్స్ తెప్పించింది.
ఇదిలా ఉండగా తాజాగా నూతన సంవత్సరం సందర్భంగా ఈ రోజు ఈ చిత్రం నుంచి ఓ పాటను విడుదల చేశారు. రా రా రత్నం (Ra Ra Rathnam ) అంటూ సాగే ఈ పాట రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. ఫుల్ రేసీగా, పవర్ ఫుల్‌గా ఉంది. నరనరాల్లో రక్తాన్ని పరుగులు పెట్టించేలా లిరిక్స్, ట్యూన్, విజువల్స్ ఉన్నాయి. వివేక్ సాహిత్యం, షేన్ భాగరాజ్ గాత్రం, దేవీ శ్రీ ప్రసాద్ బాణీ ఎంతో పవర్ ఫుల్‌గా అనిపించాయి.