Mohan Natarajan: ‘మహానది’ విలన్ మోహన్ కన్నుమూత
ABN, Publish Date - Sep 05 , 2024 | 05:35 PM
సీనియర్ సినీ నిర్మాత,నటుడు మోహన్ నటరాజన్ (71) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలు, వృద్దాప్యం కారణంగా బుధవారం వేకువజామున మృతి చెందినట్టు ఆయన కుమారుడు శరవణన్ వెల్లడించారు.
సీనియర్ సినీ నిర్మాత,నటుడు మోహన్ నటరాజన్ (71) (Mohan Natarajan) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలు, వృద్దాప్యం కారణంగా బుధవారం వేకువజామున మృతి చెందినట్టు ఆయన కుమారుడు శరవణన్ వెల్లడించారు. సాలిగ్రామంలోని ఆయన స్వగృహంలో భౌతికకాయాన్ని సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచి, బుధవారం సాయంత్రం అంత్యక్రియలను పూర్తి చేశారు.
కాగా, మోహన్ తన సొంత నిర్మాణ సంస్థ శ్రీ రాజకాళి అమ్మన్ మూవీస్ పతాకంపై అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. నిర్మాతగానే కాకుండా ‘మహానది’ మూవీలో విలన్గా కూడా నటించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. సీనియర్ దర్శకుడు పి.వాసు, హీరో సూర్య పార్థివదేహానికి నివాళులర్పించారు.
మోహన్ నిర్మాతగా ‘పూక్కలై పరిక్కాదీర్గల్’, ‘పూ మళై పొళియుదు’, ‘ఇనియ ఉరవు పూత్తదు’, ‘ఎన్ తంగచ్చి పడిచ్చవ’, ‘ఎంగ అన్నన్ వరట్టుమ్’, ‘వేలై కిడైచ్చిరుచ్చు’, ‘కిళక్కుక్కరై’, ‘చాముండి’, ‘పదవి ప్రమాణం’, ‘కన్నుక్కుల్ నిలవు’, ‘వేల్’, ‘దైవ తిరుమగన్’ తదితర చిత్రాలను నిర్మించారు.