Bijili Ramesh: కమెడియన్ ‘బిజిలి’ రమేష్ మృతి
ABN, Publish Date - Aug 29 , 2024 | 10:46 AM
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హాస్య నటుడు, యూట్యూబ్ స్టార్ ‘బిజిలి’ రమేష్ (45) అనారోగ్యంతో మృతి చెందారు.
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హాస్య నటుడు, యూట్యూబ్ స్టార్ ‘బిజిలి’ రమేష్ (Bijili Ramesh) (45) అనారోగ్యం కారణంగా సోమవారం రాత్రి 9.45 గంటల సమయంలో మృతి చెందారు. ఎంజీఆర్ నగర్ పుహళేంది వీధి, శూలైపల్లంలో ఉన్న ఆయన నివాసంలో పార్థివదేహాన్ని ఉంచగా, కోలీవుడ్‌కు చెందిన సహ నటీనటులు, అభిమానులు నివాళర్పించారు. మంగళవారం సాయంత్రం శూలైపల్లం సత్యానగర్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు.
యూట్యూబ్ ప్రాంక్ వీడియోలతో పేరు తెచ్చుకున్న బిజిలి రమేష్ (Bijili Ramesh) ఆ తర్వాత సినిమాల్లోనూ నటుడిగా వరుస అవకాశాలు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వం వహించిన ‘కోలమావు కోకిల’ (Kolamaavu Kokila) చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ‘నట్పే తుణై’, ‘శివప్పు మంజల్ పచ్చై’ ‘కోవాలి’, ‘ఆడై’ వంటి చిత్రాల్లో నటించారు. గత కానీ, మద్యపాన వ్యవసం వల్ల అనారోగ్యం భారీన పడ్డ ఆయన తర్వాత మెరుగైన వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక సాయం చేయాలంటూ విజ్ఞప్తి కూడా చేశారు. కాగా, ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు.
అయితే.. యూట్యూబులో సరదాగా వీడియోలు చేయడం మొదలుపెట్టి ఆపై మద్యం తాగి వీడియోలు చేసేవాడు. 2018లో రమేష్ చేసిన ఓ ప్రాంక్ వీడియో తెగ వైరల్ అవడంతో ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగాడు. తర్వాత మొదట నట్పే తునై సినిమాలో అవకాశం రావడం వెంట వెంటనే చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా మారిపోయాడు. ఈ క్రమంలోనే రమేష్‌కు మద్యం తాగే అలవాటు పెరగడంతో నెల కిందట ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. దీంతో అతడి భార్య చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా కాలేయం పూర్తిగా చెడిపోయిందని డాక్టర్లు నిర్ధారణ చేశారు. ఆపై రమేశ్‌కు కామెర్లు కూడా సోకడంతో వైద్య ఖర్చులు భరించడం భారమవడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.