మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Shalini Ajith: షాలిని అజిత్‌ పేరుతో.. నకిలీ ఇన్‌స్టా ఖాతా!

ABN, Publish Date - Jun 07 , 2024 | 09:51 AM

తమిళ అగ్రహీరో అజిత్‌ కుమార్ సతీమణి షాలిని అజిత్ పేరు మీద నకిలీ ట్విటర్‌ ఖాతాను సైబర్‌ నేరగాళ్ళు క్రియేట్‌ చేశారు. ఈ విషయాన్ని గ్రహించిన షాలిని... తమ అభిమానులకు ఓ విన్నపం చేశారు.

shalini ajith kumar

తమిళ అగ్రహీరో అజిత్‌ కుమార్ (Ajith Kumar) సతీమణి షాలిని అజిత్ (Shalini Ajith) పేరుమీద నకిలీ ట్విటర్‌ ఖాతాను సైబర్‌ నేరగాళ్ళు క్రియేట్‌ చేశారు. ఈ విషయాన్ని గ్రహించిన షాలిని... తమ అభిమానులకు ఓ విన్నపం చేశారు. ‘నా పేరుమీద నకిలీ ట్విటర్‌ ఖాతాను ప్రారంభించారు. దానిని ఎవరూ ఫాలో కావొద్దు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు.


కాగా, ఈ నకిలీ ఖాతాను ఇప్పటికే 80 వేల మంది ఫాలోకావడం గమనార్హం. కాగా, అజిత్‌ కుమార్ (Ajith Kumar) ప్రస్తుతం మగిళ్‌ తిరుమేని దర్శకత్వంలో ‘విడాముయర్చి’ (Vidaa Muyarchi) పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలోనూ, ఆ తర్వాత ఆధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ ( Good Bad Ugly)మూవీలో నటిస్తున్నారు.

Updated Date - Jun 07 , 2024 | 09:51 AM