Amaran: యువకుడు ఝలక్‌..  సాయి పల్లవి ఏం చేస్తుందో ..

ABN, Publish Date - Nov 21 , 2024 | 05:33 PM

తనకు ఇబ్బంది కలిగిందని పేర్కొంటూ విఘ్నేశన్‌ అనే ఇంజనీరింగ్‌ విద్యార్థి చిత్ర సినిమా టీమ్‌కు లీగల్‌ నోటీసులు పంపించాడు. గుర్తు తెలియని వ్యక్తులు, ముఖ్యంగా సాయిపల్లవి ఫ్యాన్స్‌ నుంచి తనకు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని  దీని వల్ల ఇబ్బందిపడుతున్నానని, మానసిక వేదనకు గురయ్యానని  అతను నోటీసులో పేర్కొన్నారు.


శివ కార్తికేయన్‌9Siva Karthikeyan), సాయిపల్లవి (Sai pallavi) జంటగా నటించగా విమర్శకుల ప్రశంసలతోపాటు చక్కని వసూళ్లు రాబట్టిన చిత్రం ‘అమరన్‌’ (Amaran). రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై కమల్‌హాసన్‌(Kamal Haasan) నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా వల్ల తనకు ఇబ్బంది కలిగిందని పేర్కొంటూ విఘ్నేశన్‌ అనే ఇంజనీరింగ్‌ (Engineering Student Vigneshan)విద్యార్థి చిత్ర సినిమా టీమ్‌కు లీగల్‌ నోటీసులు పంపించాడు. గుర్తు తెలియని వ్యక్తులు, ముఖ్యంగా సాయిపల్లవి ఫ్యాన్స్‌ నుంచి తనకు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని  దీని వల్ల ఇబ్బందిపడుతున్నానని, మానసిక వేదనకు గురయ్యానని  అతను నోటీసులో పేర్కొన్నారు. నష్టపరిహారంగా రూ.1.1 కోటి (1.1 Crore demand) ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ప్రస్తుతం ఇది కోలీవుడ్‌లో చర్చకు దారి తీసింది. మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘అమరన్‌’. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహించారు. ముకుంద్‌ వరదరాజన్‌ (శివ కార్తికేయన్‌), ఇందు రెబెకా వర్ఘీస్‌ (సాయిపల్లవి) నటించారు. ఇందులోని ఒక సన్నివేశంలో సాయిపల్లవి హీరోకు తన ఫోన్‌ నంబర్‌ ఇస్తుంది. దీని కోసం చిత్రబృందం ఒక నంబర్‌ ఉపయోగించింది. సినిమా విడుదలయ్యాక.. సాయిపల్లవి ఫోన్‌ నంబర్‌ అదేనని భావించిన పలువురు అభిమానులు కాల్స్‌ చేయడం మొదలుపెట్టారు. సినిమాలో చూపించిన నంబర్‌ తనేదనని.. వరుస ఫోన్‌ కాల్స్‌, సందేశాల వల్ల తనకు ప్రశాంతత లేకుండా పోయిందని విఘ్నేశన్‌ పేర్కొన్నాడు. దీనివల్ల తాను కుటుంబ సభ్యులతో సరిగా సమయాన్ని గడపలేకపోతున్నానని అన్నాడు. తన ఫోన్‌ నంబర్‌ ఉపయోగించినందుకు చిత్రబృందం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరాడు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ విషయం వైరల్‌గా మారింది.

Updated Date - Nov 21 , 2024 | 05:52 PM