తమిళనాట.. ఒక్కరోజే థియేటర్లలోకి 8 చిత్రాలు
ABN, Publish Date - Aug 08 , 2024 | 07:22 PM
ఈ నెల 9వ తేదీ శుక్రవారం ఎనిమిది చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో టాప్‌స్టార్ ప్రశాంత్ హీరోగా నటించిన ‘అంధగన్’ ఒకటి.
ఈ నెల 9వ తేదీ శుక్రవారం ఎనిమిది చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో టాప్‌స్టార్ ప్రశాంత్ (Prashanth) హీరోగా నటించిన ‘అంధగన్’ (Andhagan) ఒక టి.భారీ బడ్జెట్‌తో ప్రధాన తారాగణంతో నిర్మించారు. ఇది బాలీవుడ్ చిత్రానికి రీమేక్ అయినప్పటికీ.. దర్శకుడు త్యాగరాజన్ పూర్తిగా మార్చివేసి, తమిళ నేటివిటీకి అనుగుణంగా తెరకెక్కించారు.
ప్రశాంత్ సరసన ప్రియా ఆనంద్ (Priya Anand) హీరోయిన్‌గా నటించగా, సిమ్రాన్ (Simran), సముద్రఖని (Samuthirakani), వనిత, కార్తీక్ ఇలా అనేక మంది సీనియర్ నటీనటులు నటించారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్నో అశలు నెలకొన్నాయి. పైగా ఈ సినిమా కొత్త అనుభూతి ఇస్తుందని చిత్ర దర్శకుడు త్యాగరాజన్ అన్నారు.
వీటితోపాటు దృశ్యం ఫేమ్ ఎస్తర్ అనిల్, గౌరవ్ కాలై ప్రధాన పాత్రల్లో చిన్నారుల ఇతివృత్తంతో రూపొందించిన ‘మిన్మిని’ కూడా విడుదల కానుండగా అస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ కూతురు ఖతీజా రెహ్మాన్ సంగీతం అందించడం విశేషం.
అంతేగాక ‘గౌండంపాళెయం’, ‘లైట్ హౌస్’, ‘పి 2 - ఇరువర్’, ‘పార్క్’, ‘సూరియనుం - సూరియకాంతియుం’, ‘వీరాయి మక్కల్’ సినిమాలు విడుదలవుతున్నాయి. ఇకపోతే గత శుక్రవారం తమిళనాట విడుదలైన చిత్రాల్లో రెండు మూడు మాత్రమే పాజిటివ్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతున్నాయి.