Martin: 13 భాషల్లో.. ‘మార్టిన్’
ABN, Publish Date - Sep 04 , 2024 | 12:01 PM
మార్టిన్ సినిమాను 13 భాషల్లో డబ్ చేశారని.. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుందని యాక్షన్ కింగ్ అర్జున్ అన్నారు. ఆయన వారసుడు ధృవ సర్జా హీరోగా కన్నడలో రూపొందిన లేటెస్ట్ పారన్ ఇండియా మూవీ మార్టిన్. ఈ దసరాకు విడుదల కానుంది. ఈక్రమంలో ఆర్జున్ మీడియాతో మట్లాడారు.
మార్టిన్ సినిమాను 13 భాషల్లో డబ్ చేశారని.. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుందని యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun Sarja) అన్నారు. ఆయన వారసుడు ధృవ సర్జా హీరోగా కన్నడలో రూపొందిన లేటెస్ట్ పారన్ ఇండియా మూవీ మార్టిన్. ఈ దసరాకు విడుదల కానుంది. ఈక్రమంలో ఆర్జున్ మీడియాతో మట్లాడారు. ఒక చిత్రానికి నిజమైన హీరో నిర్మాతేనని. సినిమా కథపై ఉన్న అపారమైన నమ్మకంతో నిర్మాత కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తారని, అందువల్ల ఆయనే నిజమైన హీరో అన్నారు.
ధృవ సర్జా (Druva Sarja), వైభవి శాండిల్య (Vaibhavi sandilya), అన్వేషీ జైన్ తదితరులు నటించిన చిత్రం ‘మార్టిన్’(Martin). ఎపీ అర్జున్ (ap Arjun) దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నటుడు అర్జన్ కథ సమకూర్చారు. ఉదయ్ కె కుమార్, సూరజ్ ఉదయ్ మెహతా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించి మీడియా సమావేశం ఆదివారం నగరంలో జరిగింది.
ఈ సందర్భంగా అర్జున్ (Arjun Sarja) మాట్లాడుతూ, ‘ధృవ సర్జా(Druva Sarja) ను కోలీవుడ్‌కు పరిచయం చేయడం సంతోషంగా ఉంది. ఇందులో నేను ద్విపాత్రాభినయం చేశాను. ఇది ధృవ 50వ చిత్రం. కన్నడలో అతని ప్రతి సినిమా బ్లాక్‌బస్టర్ హిట్. ఆయనకు భారీ ఫ్యాన్‌బేస్ ఉంది. అలాంటి హీరో కోసం ఎలాంటి కథలు రాయాలనుకున్నానో బాగా ఆలోచించి ఈ కథ రాశానన్నారు. నటి వైభవి శాండిల్యకు శుభాకాంక్షలు, ఈ సినిమాను 13 భాషల్లో డబ్ చేశారని.. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుందన్నారు.
ఈ సినిమాలో చాలామంది విదేశీ ఆర్టిస్టులు నటించారని, డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో పాటు యాక్షన్, ఎమోషనల్‌గా మూవీ ఉంటుందన్నారు. అనంతరం హీరో ధృవ సర్జా మాట్లాడుతూ, ‘తమిళంలో ఇది నాకు రెండో చిత్రం. నా తొలి చిత్రం ‘సెమ్మ తిమిరు’కు మంచి స్పందన లభించింది. ‘మార్టిన్’కు కూడా అంతకంటే ఎక్కువ ఆదరణ లభిస్తుందని భావిస్తున్నాను. వచ్చే నెల 11న విడుదల చేయనున్నాం’ అని పేర్కొన్నారు.